🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 11 – 01 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ద్వాదశి* ఉ7.48 వరకు,
తదుపరి *త్రయోదశి* తె6.12 వరకు,
నక్షత్రం : *రోహిణి* మ12.29 వరకు,
యోగం : *శుక్లం* మ12.13 వరకు,
కరణం : *బాలువ* ఉ7.48 వరకు
తదుపరి *కౌలువ* రా7.00 వరకు
ఆ తదుపరి *తైతుల* తె6.12 వరకు,
వర్జ్యం : *సా5.50 – 7.22*,
దుర్ముహూర్తము : *ఉ6.37 – 8.06*,
అమృతకాలం : *ఉ9.26 – 10.57*,
మరల *తె3.03 – 4.36*,
రాహుకాలం : *ఉ9.00 – 10.30*,
యమగండం : *మ1.30 – 3.00*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.39,
*_నేటి విశేషం_*
*శని త్రయోదశి…!!*
“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరమ్”🙏
*నీలాంజనం అంటే :*
నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు,
*రవిపుత్రం అంటే :*
సూర్యుడి పుత్రుడు,
*యమాగ్రజం :*
యముడికి సోదరుడు,
*ఛాయా మార్తాండ :*
సంభూతం ఛాయా దేవికి
*మార్తాండుడు అంటే :*
సూర్య భగవానుడికి జన్మించిన వాడు,
*తం నమామి శనేశ్చరం:*
అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమల్ని అనుగ్రహిస్తాడు.
శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట, శనీశ్వరా అని మాత్రమే పలకాలి.
విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది.
ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు…
వెంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది.
ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు.
అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
శనీశ్వరుడికి బయపడాల్సిన పనిలేదు.
నవగ్రహా మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయండి.
నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల,
ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శనివారం శనికి తైలాభిషేకం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, తప్పక అనుగ్రహిస్తాడు.
శనివారం నాడు, లేదా అమావాస్య తిథిలో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.
రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని,
ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే..
వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి…
స్వస్తి..🙏
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏