నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 02 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* మ2.30 వరకు,
నక్షత్రం : *శతభిషం* ఉ7.06 వరకు,
తదుపరి *పూర్వాభాద్ర* తె5.45 వరకు,
యోగం : *పరిఘము* మ3.29 వరకు,
కరణం : *గరజి* మ2.30 వరకు
తదుపరి *వణిజ* రా1.28,

వర్జ్యం : *మ1.08 – 2.39,*
దుర్ముహూర్తము : *ఉ6.35 – 8.05,*
అమృతకాలం : *రా10.11 – 11.42,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.50,

*_నేటి మాట_*

*ప్రారబ్ధము – భగవంతుని అనుగ్రహము*
_ప్రారబ్ధాన్ని హరించేవాడు హరి!!…_
భగవంతునికి అన్నింటినీ అర్పితం చేస్తే మీకు ఏ బాధ్యతలూ ఉండవు…
మంచిది, చెడ్డదని లేదు; ఏదైనా సరే, పరమాత్ముని ఇచ్ఛ అని నిశ్చలంగా ఉండాలి…
ప్రారబ్ధమును భగవత్ అనుగ్రహము శక్తిహీనము కావిస్తుంది.
డాక్టర్లు మత్తుమందు ఇచ్చి ఆపరేషను చేసినప్పుడు ఆ నొప్పి యెట్లా తెలియదో అట్లనే, దైవానుగ్రహముంటే ప్రారబ్ధపు దుష్పరిణామం మనస్సును తాకదు.

కొన్ని మందుబాటిళ్ళ మీద, ‘దీనిసారము ఫలాని తేదీ వరకూ వుంటుంది.
ఆ తేదీలోపుననే దీనిని సేవించాలి’, అని వ్రాసి ఉంటుంది.
ఆ తేదీ తరువాత ఆ సీసాలో ఉన్న మందు యెట్లా పనిచేయదో అట్లనే, దైవానుగ్రహమునకు పాత్రుడైన మానవుణ్ణి ప్రారబ్ధము యేమీ చేయజాలదు.

కాబట్టి, ‘ప్రారబ్ధాన్ని అనుభవించే తీరాలి. బ్రహ్మాదులుకూడా దానిని తప్పించుకోలేరు’, అనకూడదు.
ప్రారబ్ధాన్ని హరించేవాడు హరి, దాని శక్తిని నశింపజేసేవాడు హరుడు.
భగవంతునిలో యేమీ లోపము లేదు – లేడనేవానికి లేడు; ఉన్నాడనేవానికి ఉన్నాడు.
యెచ్చటా లేడు అని హిరణ్య కశిపుడు చెప్పడము వలన, వానికి యెచ్చటనూ దొరకలేదు.
ఎల్లచోట్ల గలడని విశ్వసించిన ప్రహ్లాదునికి స్తంభములోనే దొరికినాడు.

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏