నేటి పంచాంగం… నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 18 – 04 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
చైత్ర మాసం,
బహుళ పక్షం,

తిథి : *పంచమి* మ1.11 వరకు,
నక్షత్రం : *మూల* తె5.38 వరకు,
యోగం : *పరిఘము* రా9.48 వరకు,
కరణం : *తైతుల* మ1.11 వరకు,
తదుపరి *గరజి* రా1.33 వరకు,

వర్జ్యం : *మ1.13 – 2.51*
మరల *తె4.50 నుండి,*
దుర్ముహూర్తము : *ఉ8.15 – 9.04,*
మరల *మ12.23 – 1.13,*
అమృతకాలం : *రా11.04 – 2.51,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మేషం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.46,
సూర్యాస్తమయం: 6.12,

*_నేటి మాట_*

*బంధం – అనుబంధం*
పడవ చుట్టూ నీరు ఉండడం వలన పడవ మునిగిపోదు,
పడవలోకి నీరు చేరడం వలనే పడవ మునిగిపోతుంది.
అలానే మనిషి సంసారంలో ఉన్నంత మాత్రమున చెడిపోడు!
పడవలోకి నీరు పోనంత వరకూ పడవకు ఎట్టి ప్రమాదమూ లేదు.
ఎప్పుడైతే పడవలోకి నీరు ప్రవేశించడం జరిగిందో అప్పటి నుండి మునిగిపోవడం ప్రారంభం అవుతుంది.

అలానే సంసారమునందలి విషయాలను తనలోకి చేర్చుకోకుండా ఉన్నంత వరకూ సంసారములో ఉన్నా కూడా మనుజుడు ఉద్దరింపబడగలడు.
అయితే మితిమీరిన సంసారాలు, బంధాలు, ఏనాడైతే తనలోకి అనుమతిస్తాడో ఆనాటి నుండి తన పతనమునకు తానే దారులు సిద్దపరిచిన వాడవుతాడు.
ప్రాపంచికమైన ఏ బంధమైనా పరిమితి మేరకే! అంతకు మించి అతుక్కుపోవడం వినాశనమే అని చెప్పక తప్పదు.

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏