🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 08 – 07 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *త్రయోదశి* రా11.50 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* తె3.21 వరకు,
యోగం : *శుక్లం* రా11.06 వరకు,
కరణం : *కౌలువ* ఉ11.03 వరకు,
తదుపరి *తైతుల* రా11.50 వరకు,
వర్జ్యం : *ఉ7.16 – 9.01,*
దుర్ముహూర్తము : *ఉ8.11 – 9.03,*
మరల *రా10.58 – 11.42,*
అమృతకాలం : *సా5.45 – 7.29,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.35,
సూర్యాస్తమయం: 6.35,
*_నేటి మాట_*
*నీటిని వదలి చేప ఉండలేనట్లే దైవాన్ని వదలి నరుడు ఉండలేదు*
ఆత్మ తత్త్వమనే బ్రహ్మానందములో ఆవిర్భవించిన జీవులనే అలలే మానవులు.
ఒక్కొక్క మానవుని రూప, భావ, తత్త్వాలు ప్రత్యేకముగా ఉండవచ్చు.
కానీ, యివన్నీ బ్రహ్మానందములోని బిందువులనే తత్త్వాన్ని మనం గుర్తించాలి.
*నీటియందే పుట్టి నీటియందే పెరిగి*
*నీటియందే అణగు నీటి బుడగ*
*నరుడు బుద్బుదంబు నారాయణుందు నీరు*
నరుడనే బుడగ నారాయణునియందే పుట్టింది. నారాయణుడనే నీటియందే సంచరిస్తుంది.
నారాయణుడనే నీటియందే నశించిపోతుంది.
నారాయణుడనే నీటిని వదలిన నరుడనే బుడగ ఉండలేదు.
అందుకనే ‘మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః’, జీవులన్నీ నా అంశములే. అని భగవద్గీతలో చెప్పబడింది. చెట్టుకు, కొమ్మ అంశము.
చెట్టును వదలి కొమ్మ ఉండలేదు.
చెట్టును వదలితే, కొమ్మ ఎండి పోతుంది, తల్లికి బిడ్డ అంశము.
తల్లిని వదలి బిడ్డ బ్రతుకలేదు, నీటిని వదలి చేప ఉండలేనట్లే దైవాన్ని వదలి నరుడు ఉండలేడు.
అశాంతి అనుభవించటానికి కారణము, ఎడబాటు.
ధన, కనక, వస్తు, వాహనాలు యివన్నీ ఆనందాన్ని అందించలేవు.
మానవుడు భార్యాపుత్రుల నిమిత్తమై, కుటుంబ బంధువుల నిమిత్తమై యెంతకాలము వినియోగిస్తున్నాడో అందులో ఒక్క క్షణకాలము భగవత్చరణ ధ్యానములో వినియోగిస్తే చాలు,
దివ్యత్వాన్ని గురించి ఒక్క క్షణము చింతించినా చాలు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏