నేటి పంచాంగం.. నేటి మాట…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 22 – 07 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
బహుళ పక్షం,

తిథి : *ద్వాదశి* ఉ6.15 వరకు,
తదుపరి *త్రయోదశి* తె4.17 వరకు,
నక్షత్రం : *మృగశిర* రా7.44 వరకు,
యోగం : *ధృవం* సా4 33 వరకు,
కరణం : *తైతుల* ఉ6.15 వరకు,
తదుపరి *గరజి* రా5.16 వరకు,
ఆ తదుపరి *వణిజ* తె4.17 వరకు,

వర్జ్యం : *తె3.45 – 5.16*
దుర్ముహూర్తము : *ఉ8.13 – 9.05,*
మరల *రా10.59 – 11.43,*
అమృతకాలం : *ఉ11.26 – 12.57,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30*,
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.38,
సూర్యాస్తమయం: 6.33,

*_నేటి మాట_*

*నామస్మరణ మహిమ*
“నాదస్వరం వినిపిస్తే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా, మనము నామస్మరణ చేస్తే మన హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి”…
నామస్మరణ చాలా పవిత్రమైనది.
ఈనాడు నామస్మరణ తగ్గి పోవడం చేతనే దేశంలో బాధలు పెరిగి పోతున్నాయి.
వీధివీధి యందు నామ సంకీర్తన చేయాలి, ఈ శరీరంలోని అణువణువునూ, కణకణమునూ భగవన్నామంతో నింపుకోవాలి…
నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్యసాహసాలు ఇంక దేనివల్లనూ లభించవు.
ఇతరులేమనుకున్నా ఫరవాలేదు,అపహాస్యం చేసినా పట్టించు కోనక్కర్లేదు…
దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మీరు అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తాము,
మన మనస్సే ఒక వీణ, అందులో చెడ్డభావాలనే ‘అపస్వరాలు’ రాకుండా చూసుకోవాలి,
మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ మీ జీవితాన్ని గడపాలి, అప్పుడే మీకు భగవదనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది.

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏