🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 05 – 08 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
శ్రావణ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ఏకాదశి* ఉ11.24 వరకు,
నక్షత్రం : *జ్యేష్ఠ* ఉ10.47 వరకు,
యోగం : *ఐంద్రం* ఉ7.52 వరకు,
కరణం : *భద్ర* ఉ11.24 వరకు,
తదుపరి *బవ* రా12.02 వరకు,
వర్జ్యం : *రా7.25 – 9.08*
దుర్ముహూర్తము : *ఉ8.16 – 9.07,*
మరల *రా10.58 – 11.43,*
అమృతకాలం : *లేదు*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.43,
సూర్యాస్తమయం: 6.29,
*_నేటి విశేషం_*
*పుత్రదా ఏకాదశి*
*పుత్ర సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి*
ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు, ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతూ శోభాయమానంగా కనిపిస్తాయి.
ఈ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు.
ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి.
ఒక నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఉంటాయి, ఈ పక్షంలో వచ్చే పదకొండవ రోజును ఏకాదశి అంటారు.
నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి.
శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రాద ఏకాదశి అని అంటారు, ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది.
శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక వ్రతం ఆచరించడం వల్ల వారికి సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం.
పుత్ర ఏకాదశి గురించి భవిష్య పురాణం ఎంతో అద్భుతంగా వివరించింది.
భవిష్య పురాణం ప్రకారం మహిజిత్తు అనే రాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని భావించాడు.
ప్రజలకు ఏ కష్టాలు లేకుండా పరిపాలన కొనసాగించాడు.
ఆ రాజుకు సంతానం లేకపోవడం వలన చింతించసాగాడు.
ప్రజలు కూడా తమ రాజుకు సంతానం కలగాలని పూజలు చేసేవారు.
సంతానం కోసం రాజు చేయని పూజ లేదు, హోమం లేదు.
తమ రాజ్యానికి సమీపంలోనే లోమశుడనే మహర్షి ఉన్నడని తెలుసుకున్న అక్కడి ప్రజలు కొందరు ఏ వ్రతం చేస్తే తమ రాజుకు సంతానం కలుగుతుందో చెప్పమని వేడుకుమారు శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే వారికి సంతానం కలుగుతుందని ఆ మహర్షి చెప్పాడు.
ఆ మహర్షి చెప్పిన ప్రకారం రాజ దంపతులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఎంతో నిష్టగా ఏకాదశి వ్రతం ఆచరించారు.
మహర్షి చెప్పినట్టుగా ఆ రాజుకు పుత్రసంతానం కలిగింది.
అప్పటినుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు.
ఈ వ్రతం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి వైష్ణవాలయాన్ని దర్శించి సూర్యాస్తమయానికి ఉపవాసం విడిచి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సంతానయోగం కలుగుతుందని భవిష్యపురాణం చెబుతోంది.
*_🍃శుభమస్తు🍃_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏