నేటి పంచాంగం.. నేటి విశేషం..!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 03 – 09 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
శుక్ల పక్షం,

తిథి : *ఏకాదశి* రా1.26 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* రా9.32 వరకు,
యోగం : *ఆయుష్మాన్* సా3.50 వరకు,
కరణం : *వణిజ* మ1.01 వరకు,
తదుపరి *భద్ర* రా1.26 వరకు,

వర్జ్యం : *ఉ6.12 – 7.54,*
దుర్ముహూర్తము : *ఉ11.35 – 12.24,*
అమృతకాలం : *సా4.25 – 6.07,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.49,
సూర్యాస్తమయం: 6.11,

*_నేటి విశేషం_*

*పరివర్తనైక ఏకాదశి*
*భాద్రపద శుద్ధ ఏకాదశీ – పరివర్తన ఏకాదశి*
*_పరివర్తనైకాదశీ_*
*━❀꧁ 🔆 ꧂❀━*
_పరివర్తన ఏకాదశి అంటే ఏమిటి ?_
_దాని ప్రత్యేకత ఏమిటి ?_
‘భాద్రపద శుద్ధ ఏకాదశి’ ని ‘పరివర్తన ఏకాదశి’ గా పిలుస్తుంటారు.
తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, ఈ రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట.
ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు.

ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం.
దశమినాడు రాత్రినుండి ఉపవసించి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, ఉపవాస దీక్షను చేపట్టి జాగరణకి సిద్ధపడి

*శ్లో𝕝𝕝 వాసుదేవ జగన్నాథ!*
*ప్రాప్తేయం ద్వాదశీ తవ!*
*పార్శ్వేన పరివర్తస్య!*
*సుఖం స్వాపిహిమాధవ!!*

అంటు శ్రీమహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.

శ్రీమహవిష్ణువు యొక్క‌ ఐదవ అవతారమైన వామనుడిగా అవతరించినది భాద్రపద శుద్ధ ద్వాదశినాడే.
ఈ భాద్రపద శుద్ధ ద్వాదశి యందు శ్రవణా నక్షత్రమున మధ్యాహ్నమందు నదీ సంగమ స్నానం చేసి సువర్ణ ప్రతిమయందు వామనమూర్తిని పూజించాలి.
సువర్ణ పాత్రతో ఆర్ఘ్యమియ్యాలి.
పూజ తరువాత సపరివారంగా వామనమూర్తిని దానం చేస్తారు.
రాత్రియందు పూజచేసి గానీ, కుదరకపోతే పగలే దధి, ఘృతములను దేవుని కర్పించి దధి దానం చేసి దుగ్ధ వ్రతమును సంకల్పించవలెను. ఈ వ్రతంలో పాలతో వండిన అన్నం విడుస్తారు.
విష్ణువనగా సూర్యుడేనని, అతని ప్రాతర్మధ్యాహ్న సాయంకాల గతులే మూడడుగులుగా వర్ణింపబడ్డాయని పెద్దలు అంటారు.

పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను.
దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు.
ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది.
ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో *”దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి , ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని”* పలికి అదృశ్యమవుతాడు.

ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను, భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు, భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు , దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు.

ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను.

ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.

అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై. వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను.
ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. *”వామనుడు మూడు పాదముల భూమి”* ని అడిగెను.
శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు.
అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను.
కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను.
సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.
_కేరళ ప్రజలు ఈరోజు తిరువోణోత్సవం చేసుకుంటారు._

*_జై శ్రీమన్నారాయణ_*
*_ॐ శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 卐_*

*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏