🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 04 – 10 – 2025,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *ద్వాదశి* మ1.56 వరకు,
నక్షత్రం : *ధనిష్ఠ* ఉ7.02 వరకు
యోగం : *శూలం* సా6.44 వరకు
కరణం : *బాలువ* మ1.56 వరకు
తదుపరి *కౌలువ* రా1.24 వరకు,
వర్జ్యం : *మ2.10 – 3.44*
దుర్ముహూర్తము : *ఉ5.54 – 7.28,*
అమృతకాలం : *రా11.39 – 1.14,*
రాహుకాలం : *ఉ9.00 – 10.30,*
యమగండం : *మ1.30 – 3.00,*
సూర్యరాశి : *కన్య,*
చంద్రరాశి : *కుంభం,*
సూర్యోదయం : 5.54,
సూర్యాస్తమయం: 5.47,
*_నేటి విశేషం_*
*శనిత్రయోదశి*
*❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀*
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు.
శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు, అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.
అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు.
శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది.
ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని, తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు.
శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి.
అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి.
శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి.
కాకికి నైవేద్యం పెట్టాలి, నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.
*_శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి_*
‘‘నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరమ్’’
*_శని త్రయోదశి: కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదు..!_*
భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు.
ముఖ్యంగా మనకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ.
దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి, మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.
ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు, అందుకే ఆయనను “కర్మ ఫలదాత” అంటారు.
ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది.
మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు.
ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.
సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు.
అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు.
నవ గ్రహాల్లో కీలకమైన శని, జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు, అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది.
నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది.
అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి.
జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు.
అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు.
ఇక త్రయోదశి తిథి వున్న శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం.
అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది.
శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.
స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది.
ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు.
ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు.
ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు.
ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.
‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు.
ఇది సృష్టి ధర్మం,’అని చెప్పిన శని పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.
శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు.
అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.
మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా.
దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు.
శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు..
ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు.
ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు, అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.
*దశరథ కృత శని స్తోత్రం*
దశరథుడు రచించిన శని స్తోత్రం గురించి పురాణ గాథ ఇలా ఉన్నది. దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు.
అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు.
అప్పుడు శనిదేవుడు ”అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు.
అది పఠించినవారిని నేను బాధించను” అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.
కుడిచేతిలోకి నీరు అక్షింతలు తీసుకుని ఓం అస్యశ్రీ శనిస్తోత్ర మహామంత్రస్య నుండీ జపే వినియోగః వరకు చెప్పిన తర్వాత నీరు వదిలేయాలి.
అథః వినియోగ:
ఓం అస్య శ్రీ శనిస్తోత్ర మంత్రస్య కశ్యప ఋషిః త్రిచ్చంద్ర: సౌరిర్దేవతా, శం బీజమ్, ని: శక్తి: కృష్ణ వర్ణేతి కీలకమ్, ధర్మార్థ కామ మోక్షాత్మ కచతుర్విధ – పురుషార్ధసిద్ద్యర్ధం జపేవినియోగః
అథ కరన్యాసం:
ఈ న్యాసం చెప్పేటప్పుడు పేరును బట్టి ఆ వేళ్లను స్పృశించాలి.
శనైశ్చరాయ అంగుష్టాభ్యాసం నమః
మందగతయే తర్జనీభ్యాం నమః
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమ: కృష్ణాంగాయ అనామికాభ్యాం నమః
శుశ్కోదరాయ కనిష్టాంగాయ అనామికాభ్యాం నమః
శుష్కోదరాయ కనిష్టకాభ్యాం నమః చాయాత్మజాయ
కరతల కరపృష్టాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః
అస్త్రాయ ఫట్ అనేటప్పుడు ఎడమ అరచేతిపై కుడిచేతితో చప్పట్లు కొట్టి ఫట్ అనే ధ్వని చేయాలి.
శనైశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా
అథోజాయ శిఖాయై వషట్ కృష్ణాంగాయ కవచాయ హుమ్
శుష్కోదరాయ నేత్రత్రాయ వౌషట్ ఛాయాత్మజాయ
అస్త్రాయ ఫట్ అథ దిగ్భంధనమ్ ఓం భూర్భవ: స్వః
అంటూ నాలుగు వైపులా చిటికెలు వేయాలి.
అథః ధ్యానమ్ నీదు ద్యుతిమ్ శూలధరమ్ కిరీటినం
గ్రథస్థితం త్రాసకరం ధనుర్ధరమ్ చతుర్భుజం
సూర్యసుతం ప్రశాంతం వందే సదాభీష్టకరం
వరేణ్యమ్ శని స్తోత్ర్రం ప్రారంభం నమః
కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి
*_𝕝ॐ𝕝𝕝 oఓo కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మన్దః ప్రచోదయాత్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏