🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
శనివారం, 2 నవంబర్ 2024
తిథి: పాడ్యమి 20:22
నక్షత్రము: విశాఖ 05:58+
మాసము: కార్తీకము (శుక్లపక్షం)
శాలివాహన శకం 1946
క్రోధి నామ సంవత్సరం (శరద్ రుతువు))
దక్షిణాయనం
యోగము: ఆయుష్మాన్ 11:17
కరణము: కీమస్తుఘ్నము 07:22 బవ 20:22 భాలవ 09:16+
సూర్య రాశి: ♎ తులారాశి
చంద్ర రాశి: ♎ తులారాశి 23:23
అమృతకాలము: 20:15 – 22:01
అభిజిత్ ముహూర్తము: 11:32 – 12:18
బ్రహ్మ ముహూర్తము: 04:34 – 05:22
దుర్ముహూర్తము: 07:42 – 08:28
వర్జ్యము: 09:40 – 11:26
గుళిక: 06:10 – 07:36
రాహుకాలము: 09:03 – 10:29
యమగండము: 13:22 – 14:48
☀ : 🌄 6:10 am – 🌇 5:40 pm
చంద్రోదయం: 02-11-2024 (06:34)
చంద్రాస్తమయం: 02-11-2024 (18:13)
*ॐ గోవర్ధన పూజ*
*ఆకాశ దీపం ప్రారంభం*
*కార్తీకమాసం ప్రారంభం*
శనివారం 2 నవంబర్ 2024
రాహు 09.00 – 10.30
యమ 13.30 – 15.00
గుళిక 06.00 – 07.30.
*_నేటి విశేషం_*
*నేటి నుండి కార్తీకమాసం ప్రారంభం….!!*
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది.
ఈ మాసం స్నానానికి విశిష్టమైనది.
ఇది దామోదర మాసం, కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేయాలి.
సూర్యాస్తమయానికి ముందుగా ‘ఆకాశదీపం’ పెట్టే సంప్రదాయం ఉంది.
హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది.
దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు.
🌿ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి.
ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం.
🌸శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది.
ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
🌿శివుడు ‘ఆశుతోషుడు’ – వెంటనే సంతోషించే స్వామి.
అభిషేక ప్రియః శివః – అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది.
🌸కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు.
🌿నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది. పాడ్యమి నాడు – గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు – ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి.
🌸కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.
కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు.
🌿కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు…
స్వస్తి..🙏
*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏