నేటి పంచాంగం…

#పంచాంగం#

🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
మంగళవారం, 12 నవంబర్ 2024
తిథి: ఏకాదశి 16:05
నక్షత్రము: పూర్వాభాద్ర 07:52
మాసము: కార్తీకము (శుక్లపక్షం)
శాలివాహన శకం 1946
క్రోధి నామ సంవత్సరం (శరద్ రుతువు))
దక్షిణాయనం
యోగము: హర్ష 19:09
కరణము: భద్ర 16:05 బవ 02:35+
సూర్య రాశి: ♎ తులారాశి
చంద్ర రాశి: ♓ మీనరాశి
అమృతకాలము: 00:27 – 01:56
అభిజిత్ ముహూర్తము: 11:33 – 12:19
బ్రహ్మ ముహూర్తము: 04:37 – 05:25
దుర్ముహూర్తము: 08:31 – 09:16, 22:40 – 23:31
వర్జ్యము: 16:35 – 18:02
గుళిక: 11:56 – 13:21
రాహుకాలము: 14:47 – 16:13
యమగండము: 09:05 – 10:30
☀ : 🌄 6:14 am – 🌇 5:38 pm
చంద్రోదయం: 12-11-2024 (14:51)
చంద్రాస్తమయం: 13-11-2024 (03:19)
*ॐ ప్రబోధిని ఏకాదశి*
మంగళవారం 12 నవంబర్ 2024
రాహు 15.00 – 16.30
యమ 09.00 – 10.30
గుళిక 12.00 – 13.30..

*_నేటి విశేషం_*

*కార్తీక శుద్ధ ఏకాదశి.. భోదన ఏకాదశి … ఉత్థాన ఏకాదశి..*
కార్తీక శుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి.. దేవ – ప్రబోధిని ఏకాదశి , ఉత్థాన ఏకాదశి అని పేర్లు.

ఆషాడ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి..
ఇది ఉత్థాన ఏకాదశిగా అయ్యింది.
దీనినే హరి – భోధిని ఏకాదశి అని కూడా అంటారు…

తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది.

మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి , అంపశయ్య మీద శయనించాడు…

ఈ రోజున ఉపవాసం ఉండి , విష్ణువును పూజించి , రాత్రి జాగరన చేసి , మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి , పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి. 

_ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది._
ఈ ఏకాదశి పాపాలను హరిస్తుందని చెబుతారు…
1000 అశ్వమేధ యాగాలు ,
100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
కొండంత పత్తిని ఒక చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో , అలాగ ఒక జీవుడు , తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది.. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం అని చెబుతారు…

ఈ రోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా , అది మేరు పర్వతానికి సమానమైన
పుణ్య ఫలితం ఇస్తుందని పురాణ కథనం…

ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని పురాణ కథలు వున్నాయి,
ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం , సంపదలు , ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపపరిహారం జరుగుతుంది.
పుణ్యక్షేత్ర దర్శనాలు , యజ్ఞయాగాలు , వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం…ఒక్కసారైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.

ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లబిస్తుంది.

బీదలకు వస్త్రదానం చేయడం వలన , పండ్లు , దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయట,

ఈ రోజున బ్రహ్మాది దేవతలు , యక్షులు , కిన్నెరులు , కింపురుషులు , మహర్షులు , సిద్దులు , యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ , భజనలతోనూ..హారతులతోనూ శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు
శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో..వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని
ధార్మిక గ్రంధాలు చెప్తున్నాయి.

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏