🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 25 – 11 – 2024,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : దశమి రా1.27 వరకు,
నక్షత్రం : ఉత్తర రా2.39 వరకు
యోగం : విష్కంభం మ3.29 వరకు,
కరణం : వణిజ మ12.32 వరకు,
తదుపరి విష్ఠి రా1.27 వరకు,
వర్జ్యం : ఉ8.14 – 9.59,
దుర్ముహూర్తము : మ12.08 – 12.53,
మరల మ2.22 – 3.06,
అమృతకాలం : సా6.45 – 8.31,
రాహుకాలం : ఉ7.30 – 9.00,
యమగండం : ఉ10.30 – 12.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.13,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి మాట_*
*” రూపము గొప్పదా ? – నామమే గొప్పదా” ??*
ఒకానొక సమయంలో, హనుమంతుని తల్లి కౌసల్య ఇంటికి వచ్చింది.
కౌసల్య, ” అమ్మా ఎవరు మీరు? అని అడిగింది.
అమ్మా! నేనెవరో నీకు తెలియదా?
విశాలమైన సముద్రాన్ని అవలీలగా దాటిన హనుమంతుని తల్లిని, ‘అని ఆమె జవాబిచ్చింది.
మరి కొద్ది సేపటికి అగస్త్యుని తల్లి వచ్చింది.
‘ అమ్మా! మీరెవరని అడుగగా, ‘ మహా సముద్రాన్ని ఒక్క గుటకలోమ్రింగిన అగస్త్యుని తల్లిని నేను, ‘ అని సమాధాన మిచ్చింది.
‘ కౌసల్య చాలా ఆనందించి, ‘ నా కుమారుడైన రాముని అనుగ్రహము వల్లనే కదా, మీ కుమారులు అంతటి ఘనకార్యములు సాధించగల్గారు, ‘ అన్నది.
అప్పుడు రాముడు వచ్చి, ‘ అమ్మా! ఇందులో నీ ఘనత, నా ఘనత ఏమీ లేదు.
వాళ్లు పవిత్ర హృదయంతో రామ నామము స్మరించడంచేతనే అంతటి ఘనత సాధించగల్గారు.
“రామ నామమే అన్నిటికీ మూలాధారము ‘అన్నాడు…
నామి( పేరుగల శరీరము)కంటే నామము గొప్పది.
రూపము అశాశ్వతము, కానీ నామము శాశ్వతము, అని చెప్పారు రాముడు.
*_☘️శుభమస్తు☘️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏