నేటి పంచాంగం.. నేటి మాట..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌸పంచాంగం🌸
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 14 – 12 – 2024,
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : *చతుర్దశి* సా4.19 వరకు,
నక్షత్రం : *రోహిణి* తె4.19 వరకు,
యోగం : *సిద్ధం* ఉ8.45 వరకు,
తదుపరి *సాధ్యం* తె.6.07 వరకు,
కరణం : *వణిజ* సా4.19 వరకు
తదుపరి *విష్ఠి* తె3.27 వరకు,

వర్జ్యం : *రా8.42 – 9.13*,
దుర్ముహూర్తము : *ఉ6.25 – 7.52*,
అమృతకాలం : *రా1.16 – 2.47*,
రాహుకాలం : *ఉ9.00 – 10.30*,
యమగండం : *మ1.30 – 3.00*,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.25,
సూర్యాస్తమయం: 5.24,

*_నేటి మాట_*

*రామ భక్తి – రామనామ శక్తి*
చెకు ముకి రాళ్లు మనకు తెలుసు,
చెకుముకి రాళ్ళు రెండూ నీటితో తడిసినా సరే, ఒకదానితో ఒకటి రాపిడి చేస్తే అగ్ని ప్రభవిస్తుంది.
అది వాటి స్వభావ సిద్ధమైన శక్తి అంత గొప్పది…

రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు సంధించిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు…
ఇంద్రజిత్తు తనకున్న సకల శక్తులను ఉపయోగించి లక్ష్మణుని లేవనెత్తి లంకకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు.

ఇంతలో రామనామం జపిస్తూ అక్కడికి హనుమంతుడు వచ్చి లక్ష్మణుని అవలీలగా ఎత్తుకుని భుజంమీద పెట్టుకుని శ్రీరాముని సన్నిధికి మోసుకుపోయేడు.

_ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటంటే!!…_
రామనామము వినగానే లక్ష్మణుని శరీరం తేలికైపోయింది, హనుమంతుడు సులభంగా మోసుకొని వెళ్ళగలిగేడు.

ఇక్కడ చేరిన అత్యంత ప్రబలమైన శక్తులు – ఇటు లక్ష్మణుని రామభక్తి, అటు హనుమంతుని రామనామ జప శక్తి…రెండూ రెండు చెకుముకి రాళ్ళు!!!…

*_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏