చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానం లో సాంకేతిక లోపం ..
టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి.. తిరిగి చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన విమానం..
రెండ్ గంటలుగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానం లోనే ప్రయాణికులు.
దేశంలో ఆరు హైకోర్టులో 33 మంది న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.
జ్యుడీషియల్ ఆఫీసర్స్ ను అడ్వకేట్స్ ను న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం._
_• న్యాయవాది తుహిన్ కుమార్ గేదెలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం._
_• న్యాయవాదులు గౌస్ మీరా మొహిద్దిన్ ,సుద్దాల చలపతిరావు ,వాకాటి రామకృష్ణారెడ్డి ,గాది ప్రవీణ్ కుమార్ లను తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.
*సూర్యాపేట జిల్లా..*
గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్.. రిమాండ్..
వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ..
అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నల్లచెరువు గుట్ట వద్ద గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్దనుండి సుమారు మూడు లక్షల రూపాయల విలువ గల సుమారు 12 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్ లు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇట్టి కేసులో అదుపులోకి తీసుకున్న 6 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన వెల్లడించారు…
*ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్*
*AP*
ఈ నెల 5న రాష్ట్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు తెలిపారు. ఇందులో ఆస్తి, సివిల్ తగాదాలు, చెకౌబౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కారం చేస్తామన్నారు. జూలై 1 నుంచి 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు….
*పెద్దిరెడ్డి భూముల ఆక్రమణలపై విచారణ చేయండి – అధికారులకు హైకోర్టు ఆదేశం*
బుగ్గమఠానికి చెందిన భూముల ఆక్రమణ అంశంపై తాజాగా విచారణ చేయాలన్న హైకోర్టు – పెద్దిరెడ్డి వివరణ తీసుకుని 4 వారాల్లో విచారణ ప్రక్రియ చేయాలని వెల్లడి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యవహారంపై తాజాగా విచారణ జరపాలని దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తిరుపతి పట్టణం, ఎంఆర్ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాల(మొత్తం 3.88)కు సంబంధించిన దస్త్రాలను వారం రోజుల్లో పెద్దిరెడ్డికి ఇవ్వాలని, తర్వాత వివరణ తీసుకోని మొత్తం నాలుగు వారాల్లో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
అందుకు ముందు విచారణ జరిపిన మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్‌తో కాకుండా మరో అధికారితో విచారణ జరిపించాలని పెద్దిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థిస్తున్న నేపథ్యంలో మరో అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 3.88 ఎకరాలను ఖాళీచేయాలంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది..
*అమరావతి :*
*అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.*
– *అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 70 మీటర్లకు బదులు 140 మీటర్లు.*
– *మూలపేట నుంచి విశాఖకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ జాతీయ రహదారి.*
– *విశాఖలో ఒకే ప్రాజెక్టుగా మెట్రో, జాతీయ రహదారి.*
– *విశాఖలో 12 జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ కారిడార్లు.*
– *మార్చిలో గడ్కరీ, చంద్రబాబు భేటీ నిర్ణయాలు అధికారికంగా వెల్లడి.*…..
రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైన బీజేపీ
పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పట్ల బీజేపీ సీరియస్
రాష్ట్ర అధ్యక్ష్య పదవికి పోటీచేసేందుకు నామినేషన్ పత్రం ఇచ్చినా, అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీపై తీవ్ర విమర్శలు చేసినందుకు రాజాసింగ్ పట్ల సీరియస్‌గా ఉన్న బీజేపీ హైకమాండ్
రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ, అతనిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాసేందుకు సిద్ధమైన రాష్ట్ర బీజేపీ నాయకత్వం…..
కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యం.
కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయి. సోడియం లెవెల్స్ తగ్గాయి.
షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నాం – యశోద డాక్టర్ ఏంవీ రావు..
వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకుల అంతుచూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆయన ప్రస్తావించారు..
అసలు మీరు అధికారంలోకి రావాలి కదా.. మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేమూ చూస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య విబేధాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. కూటమిలో తనకు, చంద్రబాబుకు మధ్య స్పష్టత ఉందని తెలిపారు. ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని అన్నారు. కూటమిలో కొన్ని విబేధాలు ఉంటే ఉండొచ్చని.. నాయకులు తిట్టుకుంటూ పొడుచుకుంటూ ఉండకూడదని సూచించారు. తమపై ఎంతో నమ్మకంతో ఏపీ ప్రజలు బాధ్యత పెట్టారని తెలిపారు. కూటమిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని అన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని సూచించారు. తామూ ఏ పార్టీని తగ్గించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. అన్ని వేళ్లు ఒకలా ఉండవని.. కానీ అన్ని వేళ్లూ కలిస్తేనే పిడికిలి అని తెలిపారు.
వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదని పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం జల జీవన్ మిషన్‌ను పట్టించుకోలేదని అన్నారు. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని ఆరోపించారు. మంచినీటిని అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించామని, వాటికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు..