హాస్టల్ గదిలో ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థుల గుంపు సామూహికంగా దాడి…!

గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ బెన్నెట్ యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థుల గుంపు సామూహికంగా దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలా కాకుండా ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకుని చేసిన బహిరంగ వేధింపుగా కనిపిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. గతంలో తల్లిదండ్రుల గురించి జరిగిన ఒక చిన్న మాట వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. హాస్టల్ గదిలో అనుష్క అనే విద్యార్థిని చుట్టూ దాదాపు పది మందికి పైగా విద్యార్థినులు గుమిగూడారు. ఆ గుంపులోని ఒక అమ్మాయి.. “నువ్వు అందరికీ సారీ చెప్పాలి.. ప్రతి సారీకి ఒక చెంపదెబ్బ ఉంటుంది.. సరేనా? అని బెదిరించడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. బాధితురాలు తాను అప్పటికే క్షమాపణలు చెబుతున్నానని ప్రాధేయపడుతున్నా, ఆ గుంపు కనికరించలేదు.నువ్వు ఏడ్చే వరకు వదలం దాడి చేస్తున్న విద్యార్థినులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. జబ్ తక్ రో నహీ జాయేగీ.. తబ్ తక్ హమ్ తుఝే భేజెంగే నహీ అని ఒక విద్యార్థిని అనడం వారిలోని పైశాచికత్వానికి అద్దం పడుతోంది. బాధితురాలి చేతులు పట్టుకుని, ఒకరు పదేపదే చెంపదెబ్బలు కొట్టారు. ఆగు.. నాకు రక్తం వస్తోంది.. అలసిపోయాను అని బాధితురాలు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదు. పైగా మా వైపు చూడు.. అందరికీ సారీ చెప్పు అంటూ ఎగతాళి చేస్తూ వేధించారు.ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న ఆగ్రహంఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ర్యాగింగ్ కాదు.. ఇది పక్కాగా దాడి, వేధింపులు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న ఇతర విద్యార్థులు ఆపడానికి ప్రయత్నించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించాలని డిమాండ్ పెరుగుతోంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, దాడికి పాల్పడిన వారిని వెంటనే బహిష్కరించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ విషయం మరో రెండేళ్ల వరకు బయటకు రాకూడదు అని నిందితులు బాధితురాలిని హెచ్చరించడం వారి బరితెగింపును సూచిస్తోంది.మౌనంలో యూనివర్సిటీ యాజమాన్యం