ఎస్ఐ కాళ్లు పట్టుకున్నా వదల్లేదు: బాధితుడి భార్య
నల్గొండ జిల్లా శాలిగౌరారం PSలో ‘థర్డ్ డిగ్రీ’ జరిగిందని బాధితులు చేస్తోన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. అకారణంగా తన భర్తను కొట్టొద్దని, పిల్లలతో కలిసి SI కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. మహిళనని కూడా చూడకుండా తనను అసభ్య పదజాలంతో దూషించారని కన్నీరుమున్నీరైంది. ఈ అమానుష ఘటనపై న్యాయం కోరుతూ బాధితులు DGP, SP సహా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.