ఓ నార్వేజియన్ జర్నలిస్టుకు, భారత విదేశాంగ శాఖ అధికారి ఘాటుగా సమాధానం.. !

ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తిన ఓ నార్వేజియన్ జర్నలిస్టుకు, భారత విదేశాంగ శాఖ అధికారి ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఏమైనా సమస్యలుంటే కోర్టుకు వెళ్లండి’ అంటూ ఆయన ఇచ్చిన జవాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐరోపా పర్యటనలో భాగంగా ఓస్లోలో ప్రధాని మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్వే ప్రధాని ప్రశ్నలకు సమాధానమిచ్చినా, మోదీ మాత్రం ప్రశ్నలను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనిపై నార్వేజియన్ జర్నలిస్ట్ హెల్లె లింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన ప్రశ్నను స్వీకరించలేదని ఆమె ఆరోపించారరు.

అనంతరం భారత విదేశాంగ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో అదే జర్నలిస్ట్ పాల్గొన్నారు. భారత ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె ప్రశ్నలు సంధించారు. దీంతో ఆమెకు, విదేశాంగ శాఖ కార్యదర్శి (వెస్ట్) సిబి జార్జ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

సిబి జార్జ్ తన సమాధానంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా సమర్థించారు. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించిందని, న్యాయం కోసం ఆర్టికల్ 32, 226 కింద కోర్టులకు వెళ్లే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. కొంతమంది విదేశీ విమర్శకులు “అజ్ఞాన ఎన్జీవోలు” ఇచ్చే నివేదికలపై ఆధారపడి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏవైనా సమస్యలుంటే కోర్టును ఆశ్రయించాలని ఆమెకు సూచించారు.జర్నలిస్ట్ పదేపదే అడ్డుతగలడంతో సిబి జార్జ్ కాస్త అసహనానికి గురయ్యారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, భారత దౌత్యాధికారి ఇచ్చిన బలమైన సమాధానంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

లింగ్ అడ్డుపడగా, జార్జ్ వెనక్కి నెట్టాడు. ఒకానొక సమయంలో, ఆ నార్వేజియన్ జర్నలిస్ట్ బ్రీఫింగ్ రూమ్ నుండి బయటకు వెళ్లి, కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. ఈ నాటకీయత, తతంగం కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో, లింగ్ తీవ్రమైన ఆన్‌లైన్ దూషణలకు గురయ్యారు. బీజింగ్ మరియు షీ జిన్‌పింగ్‌లను ప్రశంసిస్తూ ఆమె గతంలో రాసిన వ్యాసాలను ప్రస్తావిస్తూ, కొందరు ఆమెను “విదేశీ ఏజెంట్”, “గూఢచారి” మరియు “చైనా ఏజెంట్” అని కూడా పిలిచారు. అది పత్రికా సమావేశం కాదని, ప్రధాని మోదీ మరియు నార్వే ప్రధాని సంయుక్తంగా ఇచ్చిన బ్రీఫింగ్ అని కూడా చాలామంది ఎత్తి చూపారు.

అయితే, 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రధాని మోదీ అధికారిక పత్రికా సమావేశం నిర్వహించలేదని గుర్తుచేస్తూ, ఒక వర్గం ఆమెను సమర్థించింది.

ట్రోలింగ్ ఎంత తీవ్రమైందంటే, చివరికి లింగ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. “నేను ఇది రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, కానీ నేను ఏ విదేశీ ప్రభుత్వం పంపిన విదేశీ గూఢచారిని కాను. నా పని జర్నలిజం,” అని ఆమె ట్వీట్ చేసింది.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించింది..

కేవలం దిల్లీలోనే ఇంగ్లిష్, హిందీతో పాటు పలు భాషల్లో 200కు పైగా వార్తా చానళ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి రోజు అనేక ప్రధాన వార్తలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కొందరు పనికిరాని, అవగాహనలేని స్వచ్ఛంద సంస్థలు విడుదల చేసే తప్పుడు నివేదికలను ఆధారంగా చేసుకుని భారతదేశంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రశ్నలు అడగడం సరికాదని వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించిందని సిబి జార్జ్ స్పష్టం చేశారు.
ఎక్కడైనా హక్కుల ఉల్లంఘనలు జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే పూర్తి చట్టపరమైన రక్షణ దేశంలో ఉందన్నారు.