భూమా మౌనికా రెడ్డి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటారు.. మనోజ్

తన భార్య భూమా మౌనికా రెడ్డి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బరిలో ఉంటారని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. మే 20న తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన సతీమణి రాజకీయ రంగప్రవేశం, తాను ఇటీవల కొత్తగా స్థాపించిన ‘ఐక్య’ సంస్థ, అలాగే తన తండ్రితో ఉన్న విభేదాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష మౌనికా రెడ్డికి ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆమె 100 శాతం పోటీకి దిగుతుందని మనోజ్ తెలిపారు. ఆమె రాజకీయ ప్రయాణానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, తాము ఇప్పటికే రాజకీయాల్లో భాగమయ్యామని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను విస్తృతం చేసే ఉద్దేశ్యంతో ఇటీవలే ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేనా సమితి’ (AIKYA Dhairya Sena Samithi) పై ఉన్న అనుమానాలను మనోజ్ నివృత్తి చేశారు. ఇది కేవలం ప్రజల గొంతుకగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

యన భార్య భూమా మౌనిక రెడ్డి సామాజిక సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తమ పుట్టినరోజుల వేడుకలకు ముందుగా సామాజిక సేవతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఈ దంపతులు ‘ఐక్య… ధైర్య సేన సమితి’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా ప్రకటిస్తూ, సంస్థ లోగోను కూడా పంచుకున్నారు.

ఈ సందర్భంగా మనోజ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “జీవితంలోని ఒడిదొడుకులు మాకు మానవత్వమే ముఖ్యమని నేర్పాయి. సేవ చేయాలనే స్ఫూర్తి ఈరోజు కొత్తగా మొదలైంది కాదు, అది ఎప్పుడూ మాతోనే ఉంది. ఇప్పుడు ఆ స్ఫూర్తికి ఒక పేరు పెట్టి, మాతో కలిసి నడిచేందుకు మరిన్ని హృదయాలను ఆహ్వానిస్తున్నాం” అని తెలిపారు. తన భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థకు శ్రీకారం చుట్టినట్లు ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.

ఇటీవలే తాను ప్రారంభించిన ‘ఐఖ్య’ (AIKYA… Dhairya Sena Samithi) సంస్థపై వస్తున్న సందేహాలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. ‘ఐక్య’ అనేది రాజకీయ సంస్థ కాదని, ప్రజల గొంతుకగా ఉండేందుకు దాన్ని ప్రారంభించానని మనోజ్ తెలిపారు. ఈ సంస్థకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఐక్య’ కార్యకలాపాల కోసం తన సొంత నిధులనే వెచ్చిస్తానని ఆయన వివరించారు.

ఈ క్రమంలోనే, తన తండ్రి మోహన్ బాబుతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా అని మీడియా ప్రశ్నించగా… “ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ మైక్‌తో వెళ్లకండి, వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి” అంటూ మనోజ్ సరదాగా వ్యాఖ్యానించారు.