ఇరువురు అధికారుల మధ్య గొడవ …….. కత్తి తో దాడికి యత్నం
హుజూర్ నగర్ పట్టణంలోని నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ఇరువురు అధికారుల మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన చోటుచేసుకుంది… వివరాలు జీవన్ కుమార్ నీటిపారుదల శాఖలో ఏఈఈ గా పనిచేస్తున్నాడు. కాగా నూతన పాస్ పోర్ట్ అప్లై చేసుకోవడానికి పై అధికారుల పర్మిషన్ (NOC) కోసం దరఖాస్తూ చేసుకున్నాడు. అదే కార్యాలయంలో DAO గా పని చేస్తున్న వరుణ్ అదే సెక్షన్ చూస్తున్నాడు. కాగా (NOC) ఇంకా రాలేదు అసలు జిల్లా అధికారికి పంపవా లేదా అంటూ జీవన్ కుమార్ వరుణ్ ను ప్రశ్నించాడు. కాగా తన పాస్ పోర్ట్ అప్లై చేసుకోవడానికి లెటర్ ఇంకా రాలేదు అని చెప్పగా 20 రోజులు అయినా ఇంకా ఎందుకు రాలేదు అంటూ జీవన్ పై వరుణ్ దాడికి దిగి రెండు దెబ్బలు కొట్టాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అక్కడ ఉన్న సిబ్బంది వారిని ఆపారు. వెంటనే అక్కడినుండి వెళ్లిన వరుణ్ కొబ్బరిబొండాలు కొట్టె కత్తి తెచ్చి జీవన్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకొని 100 కాల్ కు ఫోన్ చేశారు. దింతో పోలీసులు వచ్చి ఇరువురిని పోలీస్ స్టేషన్ కి తరలించారు.కాగా జీవన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయనైనది..