ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన తమిళనాడు సీఎం ‘దళపతి’ విజయ్.!

ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన తమిళనాడు సీఎం ‘దళపతి’ విజయ్!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత ‘దళపతి’ విజయ్, రాజకీయాల్లోకి వచ్చినా తన మార్క్ చూపిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, పాలనలో తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సమకూర్చిన ఒక కొత్త మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సాధారణంగా ముఖ్యమంత్రులు లేదా మంత్రులు ఇలాంటి కొత్త వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. కానీ, విజయ్ ఆ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి, నేరుగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్నారు. బ్లాక్ సూట్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ, ఆయనే స్వయంగా జీప్‌ను నడిపి దాని పనితీరును, సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ టెస్ట్ డ్రైవ్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.