జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం..!

గుడిపల్లి…….
జాతీయ నూలు పురుగుల నిర్మూలన దినోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గుడిపల్లి సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అందించడం జరిగింది. గుడిపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగింది . అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటుచేసిన గుడిపల్లి పీహెచ్ సి డాక్టర్ ప్రియాంక విద్యార్థిని విద్యార్థులందరికీ నూలు పురుగుల నిర్మూలన గురించి సంబంధించిన ట్యాబ్లెట్ ఆల్బెండజోల్ వేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడిపల్లి మండల ఎం ఈ ఓ సముద్రాల శీనయ్య జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సెక్రెటరీ విజయ్ రెడ్డి, గుడిపల్లి గ్రామ ఉపసర్పంచ్ అరవపల్లి శ్రీను, మాజీ సర్పంచ్ మోపురి ఆంజనేయులు, వడ్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆశ వర్కర్లు,PHC సిబ్బంది గోవిందు తదితరులు పాల్గొన్నారు.