*రేవంత్ రెడ్డి బిజెపిలోకి చేరడం ఖాయం..*
*చంద్రబాబుకు తొత్తుల కాంగ్రెస్, బిజెపి మంత్రులు..*
*రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళితే బిజెపి గెలుపు ఖాయం..*
*సూర్యాపేట జిల్లా…..*
నేరేడుచర్ల brs పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు….
పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి…..
brs పార్టీ మండల అధ్యక్షులు సురేష్ బాబు…. అంజి రెడ్డి…. జిల్లా డిసిసిబి డైరెక్టర్ అప్పిరెడ్డి… మాజి ఎంపీపీ లు…. చేన్నబోయిన సైదులు.. లకుమాళ్ళ జ్యోతి…brs శ్రేణులు..
*ఒంటెద్దు నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..*
సీఎం రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని.. అందుకు తగినట్టుగా ఆయన వ్యవహార తీరే ఇందుకు నిదర్శనం అన్నారు…. చంద్రబాబు నాయుడు కీ తొత్తుల వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు…..
ఓటుకు నోటు కేసు నుండి బయటపడటం కోసం కేంద్రంతో రేవంత్ రెడ్డి లాలూచి…. ఆ పైరవీ కూడా చంద్రబాబు నాయుడు తోటే నడిపిస్తున్నట్లుగా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలకు వెళ్లి ప్రచారం చేసిన ప్రతి చోటు కూడా. బిజెపి గెలవడం పలు అనుమానాలకు తావిస్తోంది…
మోడీ సన్నిహితుడైన ఆదానీ గ్రూపుతో ఒప్పందాలు కూడా.. అవును అనే సంకేతాలే ఇస్తున్నాయని అన్నారు…
రాహుల్ గాంధీ ఏమో ఆదాని వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి ఏమో పిలిచి కంపెనీలకి అనుమతులు ఇస్తున్నాడు…. ఇది కూడా బిజెపి కనుసైకిల్లోనే నడుస్తుంది….. హైడ్రా పేరుతో హైదరాబాదుని ఆగం చేశాడు… నా 25 సంవత్సరాల చరిత్రలో రేవంత్ రెడ్డి పెట్టిన తిట్లు ప్రజలు ఇంకా ఎవరిని తిట్టలేదు అనుకుంటున్నా..
సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున కేంద్ర మంత్రులు అండదండలుగా ఉంటున్నారు… స్వయాన కాంగ్రెస్ నాయకులే మా ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు….. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో ఆంధ్రకు నీటిని తరలించకపోతున్నారు… అంతే కాకుండా ప్రాజెక్టులను అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాస్తున్నాడు..
మళ్లీ చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు తెలంగాణలో మొదలుపెట్టారు…. శిష్యుడైన రేవంత్ రెడ్డి ద్వార తెలంగాణాలో అడుగడుగున నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు….
మహిళా దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళాన్ని మోసం చేసింది అన్నారు…
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలని పత్రికా ప్రకటనలకు ఇచ్చారే తప్ప…
మహిళకు ఇచ్చినా హామీలులో విఫలం అయ్యారు….
గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మహిళలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు…… స్కూటీ ఏమైందని.. 2500 పథకం ఏమైందని… అడుగడుగునా మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని అన్నారు..