బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో, కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు….
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద, మతపరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి.. ఇది రాజకీయ కక్ష సాధింపు అని తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని.. ప్రజల తరఫున తన పోరాటం ఆపనని ఆయన స్పష్టం చేశారు..కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఏప్రిల్ 4న హైదరాబాద్లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29న వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు తనను, తన కుటుంబాన్ని జాతర వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు…