తీవ్రవాదుల దాడిని ఖండించిన చైనా…

జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్ని టెర్రరిస్టులు దారుణంగా చంపేశారు. మతం, పేరు అడుగుతూ మరీ హిందువుల్ని టార్గెట్ చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ సమయంలో భారత్‌కి అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ వంటి ప్రపంచ నేతలు మృతులకు సంతాపం ప్రకటించారు. గువో..ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్ముకశ్మీర్ లో జరిగి దాడి గురించి చైనా నిశితంగా పరిశీలించింది. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని రకాల ఉగ్రవాదాన్ని గట్టిగా వ్యతిరేకిస్తాము. ప్రాణాలు కోల్పోయినవారి కోసం విచారిస్తున్నా..గాయపడిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తున్నాము అని అన్నారు.

మంగళవారం అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిగిన దాడిలో కనీసం 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి శాంతియుతంగా ఉండే పహల్గామ్ ను శోకసంద్రంలో ముంచింది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు. అలాగే అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనను దేశమంతా ఖండించింది. అనేక దేశాలు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి.

ఈ దాడి కారణంగా భారత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దేశంలోని మొత్తం భద్రతా పరిస్ధితిని సమీక్షించారు. ప్రత్యేకంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఫోకస్ పెంచారు. సీసీఎస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. గాయపడినవారిని త్వరిత కోలుకోవాలని ఆకాంక్షించింది.