హైదరాబాదులో మరోసారి ED దాడులు... 13 మంది హవాలా ఆపరేటర్లపై సోదాలు.. ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్న ED అధికారులు.. పలువురు ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్న ED.. హవాలా లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు గుర్తింపు..
దాడుల అనంతరం పలువురు ఆపరేటర్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు గుర్తింంచారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. చిత్రపురి కాలనీలో రూ.75 లక్షల నగదుతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇటీవల ED అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక రియల్ ఏస్టేట్ యాడ్‌కు సంబంధించిన కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు సైతం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేశ్ బాబును ఆదేశించారు. అంతేకాదు.. హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అన్ని గ్రూపులపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల సాయిసూర్య డెవలపర్స్ ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు…
అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఊరట… యూఎస్ లో వీసాలు రద్దు అయిన ఇండియన్ స్టూడెంట్స్ కు న్యాయస్థానంలో ఊరట.. 133 మంది విద్యార్థులకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టంను నిలిపివేసిన అమెరికా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితులు…..
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు, స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) రికార్డుల రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూర్తి లా ఫర్మ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన జార్జియాలోని ఫెడరల్ జడ్జి, చట్టవిరుద్ధంగా ‘సెవిస్’ రికార్డులు రద్దు చేయబడిన 133 మంది విద్యార్థులకు తాత్కాలిక ఊరట కల్పించారు. వారి ‘సెవిస్’ రికార్డులను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు(టీఆర్ఓలు) జారీ చేశారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ , ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు ఇటీవల అనేక మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసి, వారి ‘సెవిస్’ రికార్డులను రద్దు చేస్తున్నాయి. చాలా సందర్భాలలో నేరారోపణలు రుజువు కాకపోయినా, కేవలం చిన్న చిన్న సమస్యలు (ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటివి) పేర్కొంటూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రకారం, 2025 జనవరి 20 నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రద్దు చేసిన 4,736 సెవిస్ రికార్డులలో 50 శాతం మంది భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం..వీరిలో ఎక్కువ మంది ఎఫ్-1 వీసా హోల్డర్లు, ఆప్టిమల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) చేస్తున్నవారే ఉన్నారు. ఓపీటీలో ఉన్నవారు ఇప్పటికే చదువు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మూర్తి లా ఫర్మ్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు జారీ చేసిన టీఆర్ఓలు ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. కేసులో తుది తీర్పు వచ్చేవరకు విద్యార్థుల ‘సెవిస్’ రికార్డులు పునరుద్ధరించబడతాయి. అయినప్పటికీ టీఆర్ఓ మంజూరు చేయడం… కేసులో విజయావకాశాలు బలంగా ఉన్నాయని సూచిస్తుందని వారు పేర్కొన్నారు. చిన్న చిన్న కారణాలు, కొన్నిసార్లు నిరసనల సమీపంలో ఉండటం లేదా అభిప్రాయాలు వ్యక్తం చేయడం వంటి వాటికే ‘సెవిస్’ రద్దు చేస్తున్నారని, దీనికి స్పష్టమైన నియమ నిబంధనలను ప్రభుత్వం ఉదహరించడం లేదని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు. విద్యాభ్యాసం మధ్యలో ఉన్నవారు, భారీగా పెట్టుబడులు పెట్టినవారు భవిష్యత్తుపై అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. ‘సెవిస్’ రద్దు చేస్తే విద్యార్థి హోదా కూడా రద్దయినట్లేనా, కాదా అనే దానిపై కూడా స్పష్టత కొరవడిందని మూర్తి లా ఫర్మ్ తెలిపింది….
భారత్ నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలు.. పాక్ సర్కార్ కీలక నిర్ణయాలు.. భారత విమానాలకు పాక్ ఎయిర్ స్పేస్ మూసివేత.. సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాకిస్తాన్.. భారత్ దాడి చేస్తే తిప్పి కొట్టాలని ఆదేశం.. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే: పాక్..
తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొంటున్న భారత్.. ఆ దేశంపై అనేక ఆంక్షలు విధించగా.. ఇప్పుడు వాటికి దాయాది దేశం కూడా ప్రతీకార చర్యలకు దిగింది. భారత్ తీసుకున్న దౌత్య నిర్ణయాల నేపథ్యంలో తాజాగా పాక్ భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ఆ దేశ సెక్యూరిటీ కమిటీ కొన్ని గంటల పాటు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. పలువురు పాక్ మంత్రులు, పాక్ త్రివిధ దళాలకు చెందిన చీఫ్‌లు పాల్గొని.. దాదాపు భారత్ తీసుకున్న నిర్ణయాలనే కాపీ కొట్టింది..పాకిస్తాన్లో సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ ద్వారా పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులతో పాటు, ఇతర వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అంతేకాకుండా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. ఇక అట్టారీ బోర్డర్‌ను మూసివేయాలని భారత్ నిర్ణయించగా.. దానికి ప్రతిగా వాఘా బోర్డర్‌ను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఇక 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది…అంతేకాకుండా పాకిస్తాన్ గగనతలంలోకి భారత్‌కు చెందిన విమానాలు గానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు గానీ ప్రయాణించకుండా ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో భారత్‌తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని పాకిస్తాన్ ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంది…
ఇక సింధూ నదీ జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ఖండించింది. ఇది 24 కోట్ల పాకిస్తాన్ ప్రజలకు సంబంధించిన అంశమని పేర్కొంది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు కేటాయించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి చేసే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అలాంటి చర్యలను తిప్పికొడతామంటూ వెల్లడించింది. ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు సింధూ నదీ జలాలను తరలించకుండా అడ్డుకుంటే.. ఆ దేశం మరింత ఎడారిలా మారే ప్రమాదం ఉంది…
భారత్ దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం!.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధించింది. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు చేసింది. భారత్‌లోని పాక్ హైకమిషన్‌లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్‌లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయించింది.
భారత్ ఇలా వెనువెంటనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆ దేశ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ స్టాక్ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. గురువారం ఉదయం మార్కెట్ స్టార్ట్ అయిన 5 నిమిషాలకే భారీ నష్టాలను చూసింది. మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100) 2.12 శాతం మేర పడిపోయింది. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ దాదాపు 2,485 పాయింట్లు క్షీణించి 114,740.29కి చేరుకుంది…
రూ.25 లక్షల హవాలా డబ్బులు కాజేసిన సైబరాబాద్ సీపీ గన్‌మెన్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో హవాలా డబ్బులు డీల్ చేస్తున్న నలుగురిని అరెస్టు చేస్తానంటూ బెదిరించి రూ.25 లక్షలు కాజేసిన శేఖర్
బాధితుల ఫిర్యాదుతో నిందితుడు సైబరాబాద్ సీపీ గన్‌మెన్ శేఖర్‌గా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు…
పెహల్గాంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తిరుమలలో అప్రమత్తమైన ఆక్టోపస్, పోలీసు బలగాలు
తిరుమలకు వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా సుదర్శన్ సత్రంలో మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా దళాలు..
మాక్ డ్రిల్‌లో పాల్గొన్న పోలీసు,విజిలెన్స్,ఆక్టోపన్ బలగాలు..
స్నిపర్ డాగ్స్ ని వెంటబెట్టుకొని సుదర్శన్ సత్రాని జల్లెడ బట్టిన భద్రతా దళాలు..
కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేసిన భద్రతా దళాలు…
ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో రూ.3,000 కోట్లు విలువైన భూములను కేటాయించాడు..వైయస్ జగన్, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…
రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గానీ.. ఉర్సా లాంటి కంపెనీకి మాత్రం రూ.99 పైసలకే ఎకరం భూమిని చంద్రబాబు కేటాయించాడు..వైయస్ఆర్సీపీ తెగువ ఎలా ఉంటుందో రాష్ట్రానికి మీరు చూపించారు
రెడ్ బుక్ పాలనతో యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తోలు తీస్తామంటూ కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు..
*సస్పెన్షన్ పై దువ్వాడ రియాక్షన్…*
నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు.. నా మనసులో జగన్ ఎప్పుడు చిరస్మరణీయం.
సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే.. త్వరలోనే మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వస్తాను – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్…
కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత రావును నేను బ్లాక్ మెయిల్ చేయలేదు – రిపోర్టర్ శ్యామ్
ఒక మహిళ నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు మాకు ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పింది
నేను ఎమ్మెల్యేను కలిసి మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి అని ఒక బ్రదర్‌గా చెప్పాను అంతే.. నేను 5 కోట్లు డిమాండ్ చేయలేదు
దీంతో ఎమ్మెల్యేను నేను బెదిరిస్తున్నట్టు నా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు – రిపోర్టర్ శ్యామ్