ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి.
3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.
దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.