పాకిస్థాన్ ఆర్మీతో పోరాడుతూ వీరమరణం పొందిన బలూచిస్థాన్ యువతి వీడియో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఫిదాయి హవా బలూచ్ అనే ఆ యువతి పాక్ సైనికులపై తూటాల వర్షం కురిపించింది. ధైర్యంగా ముందుకు కదులుతూ తోటి వారికి ధైర్యాన్నిచ్చింది. తమ భయానికి పాక్ సైనికులు ముందుకు రావడానికే వణికిపోతున్నారని చెప్పింది. తమ స్వాతంత్ర్యానికి ఈ పోరాటం ఎంతో ముఖ్య మని చెప్పిన 12 గంటలకే ఆమె వీరమరణం పొందింది…..
బలూచిస్తాన్ పాకిస్థాన్లో భూభాగం పరంగా అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ అపారమైన సహజ వనరులు (గ్యాస్, ఖనిజాలు) ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటూ, తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం లేదని బలూచ్ ప్రజల ప్రధాన ఆవేదన. ముఖ్యంగా చైనా చేపట్టిన CPEC (చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్) ప్రాజెక్టుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వారు భావిస్తున్నారు. అందుకే BLA వంటి సంస్థలు పాక్ సైన్యంతో పాటు చైనా ప్రాజెక్టులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయి….ప్రస్తుతానికి బలూచిస్తాన్లో పరిస్థితి నిప్పుల కొలిమిలా ఉంది. పాక్ సైన్యం భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, స్థానిక ప్రజల మద్దతు ఉన్న బలూచ్ యోధులు గెరిల్లా దాడులతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇది కేవలం తీవ్రవాద సమస్య మాత్రమే కాదు, దశాబ్దాల అణచివేతకు వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటుగా విశ్లేషకులు భావిస్తున్నారు…