భారత్-పాకిస్థాన్‌ల (India-Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (PoK) పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు సూచనలు వినిపిస్తున్నాయి..ఇలాంటి తరుణంలో ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను పీఓకే యంత్రాంగం అప్రమత్తం చేసింది.
”రెండు నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశాం” అని చౌధ్రీ అన్వర్ ఉల్హక్ స్థానిక అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు ఉల్హక్ తెలిపారు..స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే దొంగదెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్థాన్- ఆ ప్రాంత అభివృద్ధిని గాలికొదిలేసింది. ఇండియాపై విద్రోహచర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్ చూస్తోంది. పీఓకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించినవారు ఇస్లామాబాద్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరవవుతోంది. దివాళ అంచున ఉన్న పాకిస్థాన్‌ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం వినిపిస్తోంది.
కాగా, భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (PoK) పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్ కఠినంగా జవాబివ్వాలని కోరారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు…
పీవోకేలో అభివృద్ధిని గాలికొదిలేసిన పాకిస్తాన్.. భారత్ పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను చూస్తోంది. పీఓకే ప్రధాని అయిన వారు పాక్ చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. దివాళ అంచున ఉన్న పాకిస్థాన్‌ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం వినిపిస్తోంది.
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్ కఠినంగా జవాబివ్వాలని కోరారు.
పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు ఎంపీ లార్డ్ మేఘనాథ్.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మాటువేసిన ముష్కరులు దొంగదెబ్బ తీశారు. టూరిస్టులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది టూరిస్టులే. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తున్న భారత్.. ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది..
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సిద్ధం చేసిందని సమాచారం. ఇండియా దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు యుద్ధ భయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికాధికారి అసీం మునీర్ సరిహద్దుల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భయపడుతున్న సైన్యానికి ధైర్యం చెప్పేందుకే ఆయన సరిహద్దుకు వెళ్లారని తెలుస్తోంది.
పాకిస్తాన్ కుట్ర
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఇండియా ఖచ్చితంగా నమ్ముతోంది. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్లే అనీ, ఉగ్రవాదులను ఇండియాపైకి ఉసిగొల్పింది పాకిస్తాన్ అని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్‌పై ఇండియా ఆర్థిక ఆంక్షలు విధించింది. సింధు నది ఒప్పందం, వీసా రద్దు వంటి ఆంక్షలు ఇందులో ఉన్నాయి. ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇండియాపై ఆంక్షలు విధించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు, ఐదు రోజులుగా ప్రతి రాత్రి ఇండియన్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. ఇండియన్ సైన్యం కూడా దీటుగా బదులిస్తోంది.
ఆహార పదార్థాలు నిల్వ చేసుకోండి అంటూ పాక్ హెచ్చరికలు
ఇండియా పాకిస్తాన్‌పై ఎప్పుడైనా యుద్ధం ప్రకటించవచ్చు. అందుకే సరిహద్దు ప్రాంత ప్రజలు రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు నిల్వ చేసుకోవాలని సూచించారు.
సరిహద్దుల్లోని 13 ప్రాంతాల్లో రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేశామని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల కోసం ప్రాంతీయ ప్రభుత్వం ఒక బిలియన్ రూపాయల (3.5 మిలియన్ డాలర్లు) అత్యవసర నిధిని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు..