ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌…!

చివరి విడత పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఇవాళ 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప సర్పంచి ఎన్నికలూ ఇవాళే నిర్వహిచేందుకు ఎస్ఈసీ సన్నాహాలు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు..

ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.

రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.

182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీల్లో ముగిసిన పోలింగ్‌.

మ.ఒంటిగంట వరకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
మూడో విడతలో 3,752 సర్పంచ్‌, 28,410 వార్డు స్థానాలకు పోలింగ్‌.

మూడో విడత సర్పంచ్‌ స్థానాల బరిలో 12,652 మంది అభ్యర్థులు.

మూడో విడత వార్డు స్థానాల పోటీలో ఉన్న 75,725 మంది అభ్యర్థులు.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 394 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం.

మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో 7,908 వార్డు స్థానాలు ఏకగ్రీవం.

మూడో విడతలో 11 పంచాయతీల్లో దాఖలు కాని నామినేషన్లు.

మూడో విడతలో 116 వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు.
మూడో విడతలో 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేత.