చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద బారీగా వాహనాల రద్దీ. సుమారు రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్.

యాదాద్రి భువనగిరి జిల్లా.

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద బారీగా వాహనాల రద్దీ.

సుమారు రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్.

సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సభ్యులతో పట్నం విడిచి స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై ..రద్దీ రికార్డు స్థాయిలో పెరిగింది. టోల్ ప్లాజా నుండి సుమారు కిలోమీటరున్నర మేర వాహనాలు బారులు తీరాయి.

ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాహనాల తాకిడి పెరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు..

కానీ టోల్ మినహాయింపులకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద టోలు వసూలు కారణంగా వాహనాలు నెమ్మదిగానే కలుగుతున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారి పై వివిధ ప్రాంతాలలో రోడ్డు పనులు కొనసాగుతుండడంతో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద డ్రోన్లను ఉపయోగించి పర్యవేక్షణ చేస్తున్నారు.

బస్సులు లేక పడిగాపులు

సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంతూర్లకు వెళ్ళి తిరిగి స్వస్థలాలకు వచ్చేందుకు కోదాడ బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో పడిగాపులు కాశారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటకు సరిపడా బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు గంటల కొద్దీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా గురువారం ఉదయం పెద్దఎత్తున ప్రయాణికులు బస్టాండ్‌కు చేరుకున్నారు. సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని వాపోయారు. హైదరాబాద్‌కు ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు కూడా బస్సులు లేవని వాపోయారు. సాధారణ రోజుల్లో కోదాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు రూ.350కాగా, రూ.700నుంచి రూ.1000 చెల్లించి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959