ఈనెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ కేబినెట్ సమావేశం..

ఈనెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ కేబినెట్ సమావేశం..

మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అక్కడ మంత్రివర్గ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం..
సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుండటంతో సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు తెలిసింది.

18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సీపీఐ వంద సంవత్సరాల వేడుకలకు సీఎం హాజరవుతారు. అదే రోజున సాయంత్రానికి ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మేడారం చేరుకుంటారు. ఆపై 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

కీలక అంశాలపై చర్చలు :19న ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం, దర్శనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. అదే రోజు రాత్రి దావోస్కు వెళ్తారు. 18న మేడారంలో నిర్వహించాలని యోచిస్తున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా త్వరలో పురపాలక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపుకల్పనపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు, తదితర అంశాలపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.