నిన్న అసెంబ్లీ వద్ద రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు మా అమ్మను అవమానించే విధంగా ప్రవర్తించారు..
అలా చేస్తే మేము భయపడతామని అనుకుంటున్నాడు..
రేవంత్ రెడ్డి నేను ఇంద్రారెడ్డి కొడుకును, ఆమె ఇంద్రారెడ్డి భార్య.. మా సిస్టంలో భయం పెట్టుడే తప్పిస్తే భయపడడం ఉండదు
రేవంత్ రెడ్డి నువ్వు మా చరిత్ర మర్చిపోయినట్లు ఉన్నావు
నక్సలైట్ల ఉద్యమం నుండి మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాడు.. పోలీసులు ఎన్కౌంటర్కు తీసుకెళ్తేనే భయపడలేదు, దీనికి భయపడతామా!!
ఇంద్రారెడ్డి హోం మంత్రి పదవి తీసేసి, ఆయనను చంద్రబాబు అక్రమంగా జైల్లో వేస్తేనే భయపడలేదు
ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు, వెంట ఎవరూ లేనప్పుడే మా అమ్మ ఒంటరిగా రాజకీయాల్లోకి పోయింది.. అప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడతామా!!
నేనే కానీ, నా కార్యకర్తలే కానీ, ఇంద్రారెడ్డి అభిమానులే కానీ ఒక్క చుక్క కూడా భయపడం.. రెండింతల తిరిగి కొట్లడుతాం.పట్లోళ్ల కార్తీక్ రెడ్డి..
నేను ఇంద్రారెడ్డి కొడుకును.. ఆమె ఇంద్రారెడ్డి భార్య.. మా సిస్టమ్లో భయపెట్టుడే కానీ భయపడుడు ఉండదని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తన తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న అసెంబ్లీ వద్ద రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు మా అమ్మను అవమానించే విధంగా ప్రవర్తించారు. అలా చేస్తే మేము భయపడతామని అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు మా చరిత్ర మర్చిపోయినట్లు ఉన్నావు. నక్సలైట్ల ఉద్యమం నుండి మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాడు.. పోలీసులు ఎన్కౌంటర్కు తీసుకెళ్తేనే భయపడలేదు, దీనికి భయపడతామా అంటూ హెచ్చరించారు..ఇంద్రారెడ్డి హోం మంత్రి పదవి తీసేసి, ఆయనను చంద్రబాబు అక్రమంగా జైల్లో వేస్తేనే భయపడలేదు. ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు, వెంట ఎవరూ లేనప్పుడే మా అమ్మ ఒంటరిగా రాజకీయాల్లోకి పోయింది.. అప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడతామా..? నేనే కానీ, నా కార్యకర్తలే కానీ, ఇంద్రారెడ్డి అభిమానులే కానీ ఒక్క చుక్క కూడా భయపడం.. రెండింతల తిరిగి కొట్లాడుతామన్నారు. మహానేత వైఎస్సార్ చనిపోయినప్పుడు కాంగ్రెస్లో ఎవరుంటారు మాకు అన్నప్పుడు కూడా మా అమ్మ భయపడలేదు. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్లగొట్టినప్పుడు భయపడలేదు. అన్యాయంగా కేసులు పెట్టినప్పుడు భయపడలేదు. ఇప్పుడు భయపడ్తమని మీకెవరు చెప్పారన్నారు.