‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిస్సింగ్’
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్లకార్డులు చూపిస్తూ.. ఎక్కడైనా కనబడితే దయచేసి చెప్పమని ప్రజలను కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు పవన్కు కనిపించడంలేదు.. రాష్ట్ర ప్రజలకు పవన్ కనిపించడం లేదని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.