‘పెద్ది’ డైరెక్టర్ ఊహించని ట్విస్ట్.. క్షమాపణలు చెబుతూ బుచ్చిబాబు సంచలన నిర్ణయం..!

‘పెద్ది’ డైరెక్టర్ ఊహించని ట్విస్ట్..

క్షమాపణలు చెబుతూ బుచ్చిబాబు సంచలన నిర్ణయం!

‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ సీన్లపై వెనక్కి తగ్గిన దర్శకుడు..

వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటన!

సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికే గానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, గౌరవానికి భంగం కలిగించడానికి కాదన్న బుచ్చిబాబు.

‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టం చేసిన దర్శకుడు.

ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మహిళల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.. ఏ పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు: బుచ్చిబాబు

సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించి ఉంటే.. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ హృదయపూర్వక క్షమాపణలు చెప్పిన డైరెక్టర్.

సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను మార్చబోతున్నట్లు వెల్లడి

మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, సెన్సిటివిటీస్‌కు బాధ్యత వహిస్తామని.. భవిష్యత్తులో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా చూపిస్తామని బుచ్చిబాబు ప్రామిస్…

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం పెద్ది సినిమా ఇండస్ట్రీ లో ఒక ఊపు ఊపుతుంది..

కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడంలో టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి ‘పెద్ది’ విషయంలో నిజమైంది. తాజాగా భారీ అంచనాలతో వచ్చి, థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (పెద్ది). కేవలం ప్రేక్షకుల ఆదరణే కాకుండా, ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. మంచి సినిమాలను ప్రమోట్ చేయడానికి ముందుండే చిరంజీవి, సక్సెస్ అయిన సినిమాల టీమ్‌ని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందిస్తుంటారనే విషయం తెలియంది కాదు. అందులోనూ ఇప్పుడు తన కుమారుడికి పెద్ద విజయం దక్కడంతో, మెగాస్టార్ చిరంజీవి (మెగాస్టార్ చిరంజీవి) ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆ ఆనందాన్ని తెలియజేసేందుకు.. ‘పెద్ది’ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని అభినందనలు తెలియజేసారు