ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది… ప్రభాకర్ రావుతో పాటు మరో నలుగురు నిందితులను కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలూ సేకరిస్తున్నారు. మంగళవారం పలువురు బాధితులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే దాదాపు 600 మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.
2023 ఎన్నికలకు ముందు ఎక్కువమంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్లే టార్గెట్గా ఈ తతంగం నడిపినట్లు అంచనాకు వచ్చారు. రేపు ట్యాపింగ్ గురైన వారి పేర్లు చెప్పి సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారించనున్నారు. అంతేగాకుండా.. 2023 ఎన్నికల వేళ క్రియేట్ చేసిన ‘పోల్-2023’ వాట్సాప్ గ్రూపుపైనా ఆరా తీయబోతున్నారు. ఎన్నికలప్పుడు నేతల ఫోన్లు ట్యాప్ చేసి డబ్బు స్వాధీనం చేసుకోవడంపైన కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే విపక్ష నేతల డబ్బుల గురించి తెలుసుకొని.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy)ల కంపెనీల డబ్బులు పట్టుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇతర పార్టీల నేతలతో పాటు ఆరోజు అధికారంలో ఉన్న పలువురి బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయని వెల్లడించారు..సాధారణ ఎన్నికల్లో మావోయిస్టుల యాక్టివ్ అయ్యారని కమిటీకి ప్రభాకర్ రావు చెప్పారు. మావోయిస్టుల పేరుతో అధికార, ప్రతిపక్ష, వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించినట్లు తెలుస్తుంది. అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకుల ఎమ్మెల్యేల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్లు సమాచారం. ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకున్నారు. .