ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు…జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించనున్న నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌కు రావాలని సిట్ అధికారులు కేటీఆర్‌కు నిర్దేశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జిషీటు దాఖలు చేశామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ వెల్లడించారు…
హరీష్ రావు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయడంపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ‘నిన్న నాకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్‌కు ఇచ్చారు. బొగ్గు స్కామ్‌పై సమాధానం చెప్పే దమ్ములేదు. రేవంత్ రెడ్డి ఎన్ని నోటీసులు ఇచ్చినా.. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా వదలబోము. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా.. రేవంత్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన వెంటపడుతూనే ఉంటాం’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు….