77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని నావల్ డాక్ యార్డులో రెండు యుద్ధనౌకలను, జలాంతర్గామిని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ఇక నుంచి నావికాదళంలో సేవలందించనున్నాయి. ముంబయిలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. దేశ చరిత్రలో ఒకేసారి మూడు యుద్ధ నౌకలను ప్రారంభించడం ఇదే తొలిసారి.
దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం
ఈసందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఒక పోస్ట్ చేశారు. ఈ యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం వల్ల దేశ రక్షణ వ్యవస్థ, నౌకాదళం మరింత బలోపేతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో భారతదేశ స్వయం సమృద్ధి దిశగా దీన్ని కీలక ముందడుగుగా మోదీ అభివర్ణించారు. యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ మంచి పట్టు సాధిస్తోందని ఆయన కొనియాడారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్గిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ డిజైనింగ్, నిర్మాణం పూర్తిగా భారత్లోనే జరిగిందని గుర్తుచేశారు…