రేకులగడ్డ గ్రామ యువకుడికి వరుసగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..

చందంపేట ….
చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం తండ్రి చిలకల గోవిందు ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు..

జైరాం మొదటగా 2026 ఏప్రిల్ 24న నాగర్‌కర్నూల్ జిల్లా కోర్టు పరిధిలోని
జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority)లో స్టెనోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు..

తదనంతరం 2026 జూలై 29న మహబూబాబాద్ జిల్లా కోర్టు పరిధిలోని
జిల్లా న్యాయ సేవా సంస్థ (District Legal Services Authority)లో కూడా స్టెనోగ్రాఫర్‌గా మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన జైరాం కృషి, పట్టుదల, నిరంతర సాధనతో ఈ విజయాలను అందుకోవడం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.