పోలీస్ వాహనాలపై రూ.68.67 లక్షల చలానాలు..

*🔹పోలీస్ వాహనాలపై రూ.68.67 లక్షల చలానాలు*

_• ట్రాఫిక్ నిబంధనలు పాటించని ప్రజలపై చలాన్ల కొరడా ఝుళిపించే పోలీసుల్లో కొందరు ఆ నిబంధనలు తమకు పట్టవన్నట్లు వ్యవహరిస్తున్నారు._

_• తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ వాహనాలపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 17,391 చలానాలకు గాను రూ.68.67 లక్షలు చెల్లించాల్సి ఉంది._

_• ఓ వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి..

ట్రాఫిక్ నిబంధనలు traffic rules పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్లు వేస్తారు. ఫైన్లు కట్టకపోతే వాహనాలు సీజ్ చేశారు. మరీ పోలీసులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎలా.. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే తమ వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు కట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు.

తెలంగాణ డీజీపీ DGP పేరిట నమోదైన పోలీసుల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. మొత్తం రూ.68,67,885 చలాన్లు కట్టాల్సి ఉంది. ఈ వివరాలు ఆర్టీఐ rti ద్వారా అడిగిన ప్రశ్నకు పోలీస్ శాఖ అధికారులే తెలిపారు. మొత్తం వాహనాలపై 17,391 చలాన్లకు సంబంధించి రూ.68.67 లక్షల ఫైన్లు ఉన్నాయి. సామాన్యులపై ఒక ఫైన్ ఉన్నా వాహనాలు సీజ్ చేసే అధికారులు తమ వెహికిల్స్ చలాన్లు ఎందుకు కట్ట..