మంత్రాల అనుమానంతో హత్య నలుగురికి జీవిత ఖైదు

గరిడేపల్లి మండలం

పొనుగోడులో 2015లో జరిగిన హత్య కేసు లో నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్ నగర్ కోర్టు తీర్పు వెలువరించింది. గరిడేపల్లి ఎస్సై చలికంటి నరేశ్ తెలి పిన వివరాల ప్రకారం పొనుగొడుకు చెందిన యెడిపాల వీరారెడ్డి, లింగారెడ్డి కుటుంబాల మధ్య భూ వివాదాలు కొనసాగుతున్నా యి. లింగారెడ్డి కుమారుడు అనారోగ్యానికి గురి కావడానికి వీరా రెడ్డి మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో 19 జూలై 2015న వీరారెడ్డి హత్య చేసి మృతదేహాన్ని గన్ని బ్యాగులో పెట్టి పొనుగోడు రిజర్వాయర్ లో పడేశారు. వీరారెడ్డి కనిపించకపోవడంతో కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. అనంతరం నిందితులు ఎడిపాల లింగారెడ్డి, సత్య నారాయణరెడ్డి, ఉపేందర్రెడ్డి, సైదిరెడ్డిని అరెస్ట్ చేసి ఘటనలో ఉపయోగించిన రెండు బైకులు, ఐరన్ రాడ్లు, హాక్స్ బ్లేడ్, పార తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసులో సాక్షాదా రాలను ప్రవేశపెట్టడంతో మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శివరాంప్రసాద్ నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.1500 జరిమానా విధించారు. జరిమానా చెల్లిం చని పక్షంలో 45 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది..