ఈనెల 10వ తేదీన హైదరాబాదు నగరానికి విచ్చేయుచున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు బీసీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం నాడు వారు హైదరాబాదులోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటన లో. జనగణనలో కులగణన చేపట్టకుండా బీసీలను మరొకసారి మోసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కులగణన చేపడతామని ప్రకటించిన తర్వాతే తెలంగాణాలో అడుగు పెట్టాలని కుల గణన చేపడుతామని గతంలో హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన నరేంద్ర మోడీ సభకు బీసీలు ఎవరూ వెళ్ళవద్దని హైదరాబాదు అసెంబ్లీ ఎదుట గల అమరవీరుల స్థూపం వద్ద అఖిలపక్ష బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయడం ద్వారా బీసీలు తమ గళాన్ని అవలంబిస్తున్నారో బిజెపి నేతలు బహిరంగ ప్రకటన చేయాలని తెలంగాణలో 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసే కేంద్రానికి పంపి విప్పాలని ఎందుకు బీసీల పట్ల ఇంత కఠిన వైఖరి ఉన్న బీజేపీ పార్టీ నీ ఎవ్వరు నమ్మరు అన్నారు.
సంవత్సరం అవుతున్నా ఎందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ బిల్లును తొక్కి పట్టిందో తెలంగాణ ప్రజలకు వివరించాలని వారు విజ్ఞప్తి చేశారు బిజెపి పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ అనే విషయాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలని అది అగ్రవర్ణాల పార్టీ అని ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువయిందని ప్రస్తుతం తమిళనాడులోని సినీనటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీని అధికారంలో రాకుండా వక్రమార్గాలు అనుసరిస్తున్నారని ప్రజల తీర్పును అపహాస్యం పాలు చేస్తున్నారని వారు దుయ్యబట్టారు అమరవీరుల స్తూపం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు నెల్లికంటి ఉండేందుకు అనేక సత్యం యాదవ్ తో పాటు అనేకమంది బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారని సకాలానికి హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు వారి వెంట బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు ఉన్నారు.