సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2007-08లో పదో తరగతి చదువుకున్న వారందరూ ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు..
హైదరాబాద్, ఒంగోల్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన వారందరూ దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలవడంతో పాఠశాల ఆవరణలో సందడి నెలకొంది.
నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. తమకు విద్యా బుద్దులు నేర్పిన నాటి గురువుల సేవలను కొనియాడారు. నాటి ఉపాధ్యాయులు వెంకయ్య, సత్యం,పూర్ణచంద్రరెడ్డి,బుద్ధారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సందీప్, రమాదేవి, కంప్యూటర్ ప్యాకల్టీ లను ఘనంగా సన్మానించారు, కార్యక్రమానికి విద్యార్థులు శివ,వేణు, సతీష్, గురునాధం, నరేందర్, రజిని,శ్రీలత కవిత, డి రజిని, తదితరులు నేతృత్వం వహించారు.