ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ఐరా రియాల్టీ పోషం.వీరారెడ్డి
అడిగిందే తడువుగా 50 కుర్చీలు బహుమతిగా ఇచ్చిన ఐరా రియాలిటి..
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించాలని దామెర్ల అంజి అడుగగా వెంటనే ఐరా రియాల్టీ పోషం.వీరారెడ్డి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించడం జరిగింది. పోషం వీరారెడ్డి వైద్యశాలలో తన చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకోవడం జరిగింది. వైద్యశాల డాక్టర్ ప్రతినెలా మేము ఆశా వర్కర్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని కుర్చీలు కావాలని అడగగా అడిగిందే తడువుగా 50 కుర్చీలను తెప్పించి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి పార్కుగా తయారు చేయాలని సూచించారు.భవిష్యత్తులో వైద్యశాలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా వంతుగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుల.సురేష్, గొంగరెడ్డి. శ్రీనివాసరెడ్డి, ముడెం.శ్రీనివాసరెడ్డి వైద్యాధికారి సీతామహాలక్ష్మి, సిహెచ్ఓ వినోద్ కుమార్, సూపర్వైజర్ రాజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ రాములు, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసరెడ్డి, ఫార్మసిస్ట్ రాజేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.