ప్రపంచానికి ఫార్మా క్యాపిటల్‌గా భారత్‌కు పేరు ఉంది.. ప్రధాని మోదీ..
వ్యాక్సిన్ల తయారీలో సత్తా చాటుతున్నాం-ప్రధాని మోదీ....
దేశ వ్యాప్తంగా ప్రజలు 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఎర్రకోట పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు..ఎర్రకోటపై మోదీ ప్రసంగిస్తూ… కోట్లాది మంది త్యాగాలతో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ఇన్నేళ్లుగా మన రాజ్యాంగం మనకు మార్గదర్శనం చేస్తోందని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వీరజవాన్లకు సెల్యూట్ అని అన్నారు. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు. మనసైన్యం దాడులతో పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడిపిందని అన్నారు.
మన యూపీఐ ప్లాట్‌ఫాం ప్రపంచాన్ని ఏలుతోందని నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ముందంజలో ఉందని, యూపీఐ వాటా 50% ఉందని తెలిపారు. మరి మనం ఎందుకు ఇతరులపై ఆధారపడాలి అని ప్రశ్నించారు. మన సామర్థ్యాలపై విశ్వాసం ఉందని, యువత సామర్థ్యాలపై నమ్మకం ఉందని తెలిపారు…
ఆత్మనిర్భర్ భారత్ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి..
ఇది టెక్నాలజీ శతాబ్దం-ప్రధాని మోదీ.
సెమీకండక్టర్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్నాం..ఇప్పటికే 4 ఇండస్ట్రీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాం-సౌర విద్యుత్ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాం..జల విద్యుత్ ప్రాజెక్టులు పెంచాం..
అణువిద్యుత్‌లో ప్రైవేట్ సెక్టార్‌ను ఆహ్వానించాం
సముంద్రంలో చమురు వెలికితీతకు యత్నిస్తున్నాం
అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం
అంతరిక్ష రంగంలో 300కు పైగా స్టార్టప్‌లు వచ్చాయి…ప్రపంచానికి ఫార్మా క్యాపిటల్‌గా భారత్‌కు పేరు ఉంది..
బ్లాక్ మెయిల్‌కు భారత్ తలవంచే రోజులు పోయాయన్నారు..
ఆపరేషన్ సింధూర్‌తో మన దేశ సత్తా చాటామని చెప్పారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదంటూ దాయాది పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేశారు. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదన్నారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నానని వెల్లడించారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు…ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. పహల్గాంలో మతం పేరుతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాం. యావత్ దేశం ఆగ్రహంతో రగిపోయింది. మన సైన్యం పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేఛ్చ త్రివిధ దళాలకే ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ హీరోలకు నా సెల్యూట్.
ఇకపై భారత్ ఎవరి బ్లాక్ మెయిల్ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని మళ్లీ చెబుతున్నా. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్ మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటి బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదు..భారత ప్రభుత్వం ముఖర్జీ 125వ జయంతిని 2025 జులై 6 నుంచి 2026 జూలై 6 వరకు జరుపుకుంటోంది.దేశ రాజకీయ, విద్యా, సాంస్కృతిక నిర్మాణంపై ఆయన శాశ్వత ప్రభావాన్ని గౌరవిస్తుంది. మినార్లు, ప్రదర్శనలు, సినిమాలు, యువతకు చేరువయ్యే కార్యక్రమాలు ఉంటాయి. విద్యా, పౌర సమాజ సంస్థల సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకలు, ముఖర్జీ వారసత్వ జాతీయత, విద్య, నాగరికత గర్వంతో దేశాన్ని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి” అని మోదీ తెలిపారు.
అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలి: మోదీ
దేశంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు, కొండచరియలు విరిగిపడటం, వంటి ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సంతాపం తెలియజేస్తూ, సంఘీభావం ప్రకటిస్తూన్నానని మోదీ అన్నారు. “ప్రకృతి మనందరినీ పరీక్షిస్తోంది. ఇటీవలి రోజుల్లో, మనం వరుస విధ్వంసకర సంఘటనలు, కొండచరియలు విరిగిపడటం, మేఘావృతాలు, అనేక ఇతర విపత్తులను చూశాం. ప్రభావితమైన వారికి మా హృదయపూర్వక సంతాపం, సంఘీభావం తెలియజేస్తున్నాం” అని మోదీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రెండూ సమన్వయంతో పనిచేస్తున్నాయని మోదీ అన్నారు. సహాయక చర్యలు నిర్వహించడానికి, సమర్థవంతమైన పునరావాసం కల్పించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని ఆయన అన్నారు…