ప్రముఖ సింగర్ ప్రశాంత్ తమంగ్ కన్నుమూత
ఇండియన్ ఐడల్(2007) విజేత, సింగర్ ప్రశాంత్ తమంగ్ ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో ఆయన తుది శ్వాస విడిచారు. ‘పాతాళ్ లోక్’ సీజన్-2 లో నటించి తమంగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డార్జిలింగ్లో పుట్టిన ప్రశాంత్.. కోల్కతా పోలీస్ గా కెరీర్ మొదలుపెట్టి మ్యూజిక్ వైపు అడుగులు వేశారు. నేపాల్లో పాపులర్ సింగర్ గా ఎదిగి ‘గోర్ఖా పల్టాన్’ సినిమాతో హీరోగా మారారు….
ఇక ప్రశాంత్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి వార్త తమను కలచివేసిందని అన్నారు. ఇండియన్ ఐడల్ షోలో రాణించడంతో పాటు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారని తెలిపారు. డార్జిలింగ్కు చెందిన ప్రశాంత్ పోలీసు శాఖలో కూడా పనిచేసి రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు సంఘీభావం తెలిపారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959