పుతిన్ భారత్ పర్యటనకు ముందే మా స్నేహం బలమైందంటూ అమెరికాకు హెచ్చరిక..!
డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో ”దోస్తీ” గురించి మాట్లాడుతూనే, యూరప్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు..భారత్ దిగుమతులను పెంచడం గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని పుతిన్ చెప్పారు. భారత్, చైనాతో సహా కీలక భాగస్వాములతో రష్యా ఆర్థిక సంబంధాలు మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. VTB ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు..నేను, ప్రధాని మోడీ రాబోయే పర్యటనలో భారతీయ దిగుమతుల గురించి చర్చిస్తాము, గత మూడేళ్లలో భారత్, చైనా రెండింటితో ద్వైపాక్షిక వాణిజ్యం బాగా పెరిగింది” అని పుతిన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వెస్ట్రన్ దేశాలు పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలు దౌత్యాన్ని విడిచిపెట్టాయని ఆరోపించారు. ”యూరప్ యుద్ధం చేయాలనునకుంటే, మేము సిద్ధంగా ఉన్నాము” అని ఆయన అన్నారు. యూరోపియన్లకు శాంతియుత ఎజెండా లేదని, వారు యుద్ధం వైపు ఉన్నారని మండిపడ్డారు.
ఇతరులపై ఒత్తిడి తీసుకురావడానికి తమ గుత్తాధిపత్య స్థానాన్ని ఉపయోగించే దేశాల వల్ల ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని రష్యా అధ్యక్షుడు అన్నారు. పాశ్యాత్య దేశాలు తమకు పోటీ ఉండకూడదని అనుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వారు విఫలమవుతూనే ఉంటారని, రష్యా తన జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్వతంత్ర ఆర్థిక మార్గాన్ని అనుసరిస్తుందని పుతిన్ పునరుద్ఘాటించారు. మా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సార్వభౌమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూనే ఉంటామని పుతిన్ స్పష్టం చేశారు…
అమెరికా ఒత్తిడికి తలొగ్గేలా భారత్ సెప్టెంబర్ నుండి రష్యన్ ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించడం ప్రారంభించింది. ఆగస్టులో ట్రంప్ పరిపాలన 25 శాతం అదనపు సుంకం విధించడం వల్ల మొత్తం సుంకం 50 శాతానికి పెరిగింది.దీని ప్రభావంతో భారతదేశం సెప్టెంబర్లో రష్యా నుండి 17 శాతం తక్కువ దిగుమతులు చేసింది.డిసెంబర్లో ఈ దిగుమతులు రోజుకు 600,000-650,000 బ్యారెళ్లకు పడిపోయే అవకాశం ఉంది. గతంలో 1.8 మిలియన్ బ్యారెళ్ల (bpd)గా ఉండగా ఈ సారి అది భారీగా తగ్గే అవకాశం ఉంది.
అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ ఆంక్షలను ఉల్లంఘించకుండా ఉండేందుకు భారత్లోని రిఫైనరీ సంస్థలు ప్రత్యామ్నాయ వనరులు వెతుకుతున్నాయి. రష్యాపై విధించిన తాజా ఆంక్షలే రష్యన్ చమురుకు పెద్ద సమస్యగా విదేశీ ఎనర్జీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, భారత్ ఇప్పటికీ రష్యా చమురును ప్రపంచంలో రెండవ అతిపెద్దగా కొనుగోలు చేసే దేశం. అక్టోబర్లో రూ.22,170 కోట్ల విలువైన ముడి చమురు భారత్కు చేరింది. చైనా రూ. 32,820 కోట్లతో మొదటి స్థానంలో ఉంది…