రాప్తాడు నిందితుడు హేమంత్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
తీవ్రగాయాలైన హేమంత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాచుకున్నట్లు సమాచారం వచ్చి వెళ్లిన పోలీసులు
పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి పారిపోయిన హేమంత్
హేమంత్‌పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు కట్ చేసే మెషిన్‌తో అత్యంత కిరాతకంగా దాడి చేసిన హేమంత్
అనంతపురం: రాప్తాడు కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో హేమంత్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాప్తాడు ఘటనకు సంబంధించి నిందితుడు హేమంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అతడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను ప్రతిఘటిస్తూ హేమంత్ తిరగబడినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, హేమంత్ దాడిలో సీఐ వెంకటేశ్వర్లు చేతికి గాయాలు అయ్యాయి.
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హేమంత్ పోలీసులపై తిరగబడటానికి గల కారణాలు, కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల అధికారిక ప్రకటన వెలువడితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది..