రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు..గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులు వీచే ఆస్కారం..!

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్‌. గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులు వీచే ఆస్కారం. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ. ~HYD వాతావరణ కేంద్రం…

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మరోసారి మార్పులకు లోనవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల వాతావరణం కొంత చల్లబడినప్పటికీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరో వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి, క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. వర్షం పడే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్‌ ఇచ్చింది. మరో రెండ్రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది…