సినిమా పరిశ్రమని, కళాకారులని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉంది.. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గద్దర్ అవార్డ్స్ లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది..! .హైదరాబాద్ను భారతీయ సినిమాకు కేంద్రంగా మార్చాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. గురువారం (మార్చి 19) హైటెక్స్లో జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. .. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో వెనకబడిందనడం కొంత చర్చనీయాంశంగా మారింది…ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి. దీని అర్ధం గ్రహించి ఆగిపోయిన అవార్డులను ముఖ్యమంత్రి రేవంత్ గారు కళాకారులను గౌరవించుకోవాలి అని దీనికి పునర్జీవం పోశారు. పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసి ఉంది అనుకుంటున్నాను. కాబట్టి సినిమాలకు దగ్గరగా ఉండే సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రేరణగా తీసుకొని మరింత ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సహంతో మరింత రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ ఆలోచన కూడా చేయాలని ఈ వేదిక నుంచి విన్నవిస్తున్నాను అని అన్నారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విశ్వ నటుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున దంపతులు, రాం చరణ్, ఖుష్బూ, అక్కినేని నాగచైతన్య దంపతులు, అల్లు అరవింద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. .
మార్చ్ 19న ఉగాది సందర్భంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఉత్సవం హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించారు. 2025 సంవత్సరానికి గాను ఇటీవల ఈ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, రష్మిక.. లతో పాటు భారీగా సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు..