సోమవారం గౌహతి వేదికగా ఏపక్షంగా ముగిసిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది… మ్యాచ్‌కు ముందు భారీ వర్షం కారణంగా పిచ్ కవర్లపై కప్పి ఉంచడంతో మాయిశ్చర్ వచ్చి బౌలర్లకు అడ్వాంటేజ్‌గా మారింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు నిప్పులు చెరగగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు…
15 ఏళ్ల సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో ఆర్చర్, బర్గర్, జడేజా సీఎస్‌కే పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు..అనంతరం రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 38 నాటౌట్) ఆచితూచి ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీసాడు.
పవర్ ప్లేలోనే సంజూ శాంసన్(6), రుతురాజ్ గైక్వాడ్(6), ఆయుష్ మాత్రే(0), మాథ్యూ షార్ట్ వికెట్లను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ 41 పరుగులే చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పిచ్ కండిషన్స్‌ను పట్టించుకోకుండా గుడ్డిగా ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్(17), శివమ్ దూబే(6) చెత్త షాట్లతో వెనుదిరగ్గా.. రూ.14.20 కోట్ల కార్తీక్ శర్మ 18 పరుగులే చేశాడు.
నూర్ అహ్మద్(1), మ్యాట్ హెన్రీ(5) చేతులు ఎత్తేయగా.. అన్షుల్ కంబోజ్(7 నాటౌట్)తో కలిసి జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) ఆచితూచి ఆడి జట్టుకు 127 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ ఇద్దరూ ఆఖరి వికెట్‌కు 33 పరుగులు జోడించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసారు…