ఇరాన్ హార్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు తెరవాలి..ఒప్పందం కుదరకపోతే, విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలు ఖతం చేస్తాం..ట్రంప్.,.

ఇరాన్‌తో యుద్ధం కీలక దశకు చేరుకున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వెంటనే తమ షరతులకు అంగీకరించి, హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ త్వరగా ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలు, మరియు ఆ దేశానికి గుండెకాయ వంటి ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని, మానవతా దృక్పథంతో ఇప్పటివరకు చమురు క్షేత్రాలను వదిలిపెట్టామని, కానీ ఏప్రిల్ 6 లోపు చర్చలు సఫలం కాకపోతే “సర్వనాశనం” తప్పదని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.